ఎప్పుడో 1995లో సిసింద్రిగా అలరించిన అక్కినేని మూడో తరం వారసుడు నవ యువ మన్మధుడు అక్కినేని అఖిల్ హీరోగా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మాస్ చిత్రాలను అద్బుతంగా తెరకెక్కించే.. వివివినాయక్ అఖిల్ నటిస్తున్న చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం సింహభాగం షూటింగ్ పూర్తిచేసుకున్నది. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్నది. ఇక ఇదిలా ఉంటే, అప్పట్లో పాకే దశలోనే సిసింద్రిగా వచ్చి రికార్డు సృష్టించిన అఖిల్.. ఇప్పుడు కొత్త సినిమాతో మరో రికార్డును సొంతం చేసుకున్నాడు.
సినిమా ముగింపు దశలో ఉండగానే బిజినెస్ పరంగా కూడా దూసుకుపోతున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే ఈ చిత్రం 50 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ అయినట్టు తెలుస్తున్నది. ఈ బిజినెస్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు సినీ ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అగ్రహీరోలకు ఏ మాత్రం తగ్గకుండా అఖిల్ చిత్రం బిజినెస్ జరుపుకోవడం విశేషం. తొలి సినిమా విడుదలకు ముందే ఇంత భారీమొత్తంలో బిజినెస్ చేయడం టాలివుడ్ లో ఒక రికార్డ్. హీరో నితిన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక అయోషా సైగల్ అనే కొత్తమ్మాయి హీరోయిన్ గా నటిస్తున్నది. థమన్ – అనూప్ రూబెన్స్ లు ఈ చిత్రానికి సంగీతం అందించడం విశేషం. విడుదలకు ముందే బిజినెస్ పరంగా సంచలనం సృష్టించిన ఈ చిత్రం విడుదల తరువాత ఎంత ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon