ఒకభర్త తన భార్యకు ఇలా ఎస్‌ఎమ్‌ఎస్ చేశాడు…
నా జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినందుకు, నా జీవితంలో ఒక భాగమైనందుకు నీకు కృతజ్ఞతలు, ఇప్పుడు నేనీ స్థితిలో ఉండడానికి నువ్వే కారణం,
నువ్వు నాదేవతవి, నువ్వు నా జీవితంలో వచ్చినందుకు, చాలా చాలా థ్యాంక్స్, నువ్వు గొప్పదానివి..
భర్త ఎస్‌ఎమ్‌ఎస్ చదివి భార్య ఇలా రిప్లై ఇచ్చింది..
తాగడం అయ్యిందా!
ఇక ఎస్‌ఎమ్‌ఎస్‌లు పంపడం ఆపు..
నోరు మూసుకొని ఇంటికి రా..
భయపడకు.. నేను నిన్ను ఏమీ అనను
త్వరగా ఇంటికి రా..
ఇది చదివి భర్త..
థ్యాంక్స్..
నేను ఇంటి బయటే ఉన్నా!
దయచేసి తలుపు తెరువు…
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon