ఆ కుర్రాడు చదువుతున్నది 10 వ తరగతి. ఇంకా మీసాలు కుడా సరిగా రాలేదు. అయితేనేం స్కూల్‌లో పాఠాలు చెబుతున్న పంతులమ్మని పెళ్లి చేసుకున్నాడు. పంతులమ్మకే లైన్‌వేసి పడగొట్టాడో.. లేక పిల్లవాడిని మాయ చేసి పంతులమ్మే అతగాడిని ప్రోత్సహించిందోగాని ఇద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. తమిళనాడులో జరిగిన సంఘటన సంచలనం రేపింది.
ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న అజిత్ అదే పాఠశాలలో తనకు టీచరైన వైష్ణవిని ప్రేమించాడు. ఆమెకూడ ఈ కుర్రాడితో ప్రేమకు సై అంది. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. విచిత్రమైన వావీవరుసలు లేని ఈ ప్రేమ పెళ్లికి వీళ్ల కుటుంబ సభ్యులు సైతం వచ్చి మరీ ఆశీర్వదించడం విశేషం. విదేశాల్లో సాధారణంగా ఇలాంటి వివాహాలు జరుగుతుండగా ఇండియాలో కూడా ఈ వైనం వెలుగు చూసింది.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon