0

ITEMVIDEOS: ప్రపంచంలోనే మొదటి రోబోల పెళ్లి

      First ever robots marriage in japan
ఇక నుండి మనుషులే కాదు.. రోబోలు కూడా పెండ్లిండ్లు చేసుకుంటున్నాయి. ప్రపంచంలోనే తొలిసారి రెండు రోబోలకు జపాన్‌లో అంగరంగవైభవంగా వివాహం జరిగింది. టోక్యోకు చెందిన మేవా డెన్కీ అనే రోబోల తయారీ సంస్థ శనివారం ఓ ఫంక్షన్ హాల్‌లో ఫ్రోయిస్ అనే మగ రోబోకు, యుకిరిని అనే ఆడ రోబోకు పెండ్లి ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం రెండురోజుల ముందే స్థానికులతో పాటు తమ సంస్థలోని రోబోలకు ఇతర కంపెనీల్లోని రోబోలకు పెండ్లి పత్రికలు కూడా పంపింది. సాయంత్రం ముహూర్తానికంటే ముందే అతిథులుగా రోబోలు ఫంక్షన్ హాల్‌కు చేరుకున్నాయి. జనం కూడా వచ్చారు.

అతిథులంతా హర్షద్వానాలు చేస్తుండగా వధువు యుకిరిని సిగ్గులొలుకుతూ వేదికపైకి చేరుకుంది. అటు తర్వాత వరుడు ఫ్రోయిస్ దర్జాగా వేదికపైకి వచ్చాడు. ముహూర్తం సమయానికి యుకిరి, ఫ్రోయిస్ ఉంగరాలు మార్చుకున్నారు. జపాన్ వివాహ సంప్రదాయం ప్రకారం ఇరు రోబోలు అదర చుంభనం చేసుకున్నాయి. ఆపై కేక్ కట్ చేశాయి. వివాహ వేడుక అనంతరం మిగతా రోబోలు వడ్డిస్తుండగా జనం వివాహ విందును ఎంజాయ్ చేస్తూ తిన్నారు. మొత్తానికి ఇక మీద రోబోల పెళ్లిలకే ఆహ్వానాలు వస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే రోబోల పెళ్లైనా కానీ మంచి విందు పెడితే మాత్రం కేక అని భావించే భోజనప్రియులు కూడా చాలా మందే ఉన్నారు. 

        
Previous
Next Post »