0

94 యేళ్ళ వ్యక్తి కడుపులో బుల్లెట్ : ఆరు దశాబ్దాలుగా ఎలా ఉంది?


సాధారణంగా బుల్లెట్ శరీరంలో దిగిందంటే ఆ మనిషి ప్రాణాలతో జీవించడం దుర్లభమే. కానీ, 94 యేళ్ల వృద్ధుడు మాత్రం ఓ బుల్లెట్‌తో ఆరు దశాబ్దాల పాటు జీవించాడు. అయితే, జీవిత చరమాంకంలో తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ పరీక్షించిన వైద్యులు... అతని కడుపులో బుల్లెట్ ఉందని, అందువల్లే కడుపు నొప్పి వస్తుందని తేల్చారు. ఇంతకీ ఈ బుల్లెట్ ఎప్పటిదో తెలుసా.. 1945లో జరిగిన రెండో ప్రపంచ యుద్ధం నాటిది. 

ఈ బుల్లెట్ అప్పటి నుంచి అలానే ఆ వ్యక్తి కడుపులో ఉండిపోయింది. అయితే బుల్లెట్ తగిలినట్టు ఆయనకు తెలియకపోవడం విశేషం. ఆ వ్యక్తి చైనాలోని షిచువా ప్రాంతానికి చెందిన డువాన్ జికాయ్ (94) అనే వృద్ధుడు. పాతకాలానికి చెందిన వ్యక్తి కావడం, చైనా ఆర్మీలో పనిచేయడంతో తనకున్నపరిజ్ఞానం మేరకు కడుపునొప్పి విరుగుడు మందులు వాడుతూ నొప్పి తగ్గించుకుంటున్నాడు. గత కొంత కాలంగా కడుపునొప్పి తీవ్రత పెరగడంతో జికాయ్ వైద్యులను సంప్రదించాడు. అతని కడుపుని స్కాన్ చేసిన వైద్యులు షాక్‌కు గురయ్యారు.

అతని కడుపులో 1.1 అంగుళాల బుల్లెట్ కనిపించింది. అదెలా వచ్చిందని ఆరాతీయగా, ఆయన 1943లో రెండో ప్రపంచ యుద్ధంలో చైనా తరుపున పోరాడాడని, అప్పుడు తగిలి ఉండవచ్చని చెప్పారు. అయితే ఆపరేషన్ చేసి బుల్లెట్ తీసేందుకు ఆయన వయసు సహకరించదని, కడుపునొప్పి నివారణకు మందులిచ్చి పంపేశారు. మొత్తానికి 60 ఏళ్లుగా ఆ బుల్లెట్ ఆయన కడుపులో సహవాసం ఉండడం విశేషం.


Previous
Next Post »

ConversionConversion EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng