హైదరాబాద్: మహేష్ బాబు మాదిరిగా రవితేజ కూడా వివిధ కార్పొరేట్ బ్రాండ్లకు ప్రచారం చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. రవితేజ ఇటీవలే 'లునార్ - వాక్ మేట్' చెప్పులను ప్రమోట్ చేసేందుకు డీల్ కుదుర్చుకున్నాడు.
తాజాగా ఆయనకు మరో ఆఫర్ వచ్చినట్లు సమాచారం. ప్రముఖ లిక్కర్ బ్రాండ్ 'లార్డ్ అండ్ మాస్టర్ విస్కీ'ని ప్రమోట్ చేయాలని కంపెనీ వారు ఆఫర్ ఇచ్చారట. ఇందుకోసం రవితేజకు భారీ పారితోషికం దక్కినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ యాడ్ చిత్రీకరణలో రవితేజ పాల్గొనబోతున్నాడని అంటున్నారు.
మాస్ మహారాజగా పేరున్న రవితేజ ఈ బ్రాండ్ ప్రమోట్ చేస్తే అమ్మకాలు పెరుగుతాయని కంపెనీ భావిస్తోందట. గతంలో మహేష్ బాబు కూడా ‘రాయల్ స్టాగ్' తరుపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.
రవితేజ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో ‘బెంగాల్ టైగర్' చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. తమన్నా, రాశి ఖన్నా హీరోయిన్లు. ఏమైంది ఈవేళ, అధినేత, ప్యార్ మే పడిపోయానే వంటి ఉత్తమాభిరుచి వున్న చిత్రాల్ని అందించిన నిర్మాత కె కె రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
మరో వైపు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కిక్-2' విడుదలకు సిద్దంగా ఉంది. సినిమాలోని కొన్ని సీన్లు రీ షూట్ చేస్తుండటం వల్ల విడుదల ఆలస్యం అవుతున్నట్లు సమాచారం. కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, సంగీతం: యస్.యస్.థమన్, కెమెరా: మనోజ్ పరమహంస, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: నారాయణరెడ్డి, ఫైట్స్: రామ్-లక్ష్మణ్.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon