0

షూటింగులో బాలీవుడ్ హీరోయిన్ కు గాయాలు


హైదరాబాద్: బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ షూటింగులో గాయపడింది. ఈ సంఘటనలో ఆమె కుడి భుజానికి గాయమైంది. ప్రస్తుతం ఆమె ‘కపూర్ అండ్ సన్స్' చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ తమిళనాడులోని కూనూర్‌లో జరుగుతోంది. అయితే పెద్ద గాయమేమీ కాదని, ప్రస్తుతం కోలుకుంటున్నట్లు అలియా భట్ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. కపూర్ అండ్ సన్స్ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్నాడు. శకున్ బాత్రా దర్శకత్వం వహిస్తుండగా ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు.
ఆ సంగతి పక్కన పడితే... బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ మహేష్ భట్ కూతురైన అలియా భట్ ప్రస్తుతం తల్లిదండ్రులతో ఉండకుండా సపరేటుగా ఇల్లు తీసుకుని ఉంటోంది. తల్లిదండ్రులతో కలిసి ఉంటూ వారి అదుపు ఆజ్ఞల్లో కాకుండా సొంతగా తనకు నచ్చినట్లు లైప్ స్టైల్ లీడ్ చేయాలని డిసైడ్ అయింది అలియా భట్.
తన తల్లిదండ్రులు ఉంటున్న ఇంటికి కూతవేటు దూరంలోనే మరో ఇంటిని వెతుక్కుంది. అలియా నివాసం ఉండే ఈ ఇంటికి తన తల్లి సోని రజ్వాన్, అర్కిటెక్ట్ అయిన అలియా తాత కలిసి ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తున్నారట. ఇటీవల అలియా భట్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ....‘నాకు అంతా కొత్తగా అనిపిస్తోంది. నా జీవితం అంతా నా తల్లిదండ్రులతో గడిపాను. ఇపుడు నాకంటూ సెపరేట్ జీవితం కావాలనిపిస్తోంది. నా తల్లిదండ్రులు ఉంటున్న ఇంటికి దగ్గర్లోనే మరో ఇంటిని తీసుకోవాలనుకుంటున్నాను' అని చెప్పుకొచ్చింది.
అలియా భట్ ఈ ఇంట్లో ఎవరితో కలిసి ఉండబోతోందని భావిస్తున్నారు? అందరూ తన బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ఈ ఇంట్లో సహజీవనం చేస్తుందని అనుకుంటారు. కానీ ఈ పని చేయాలంటే అలియాకు మరింత ధైర్యం, ఇంకా సమయం కావాలి. ప్రస్తుతానికైతే తన సిస్టర్ షాహీన్‌తో కలిసి ఈ ఇంట్లోకి వెలుతోంది.
కూతురును ప్రాణంగా చూసుకునే మహేష్ భత్ తొలుత ఆమె నిర్ణయానికి ఒప్పుకోలేదట. ఎలాగో అలా తండ్రిని కన్విన్స్ చేసింది అలియా. కూతురు కోరికను కాదనలేక...అయిష్టంగానే ఒప్పుకున్నాడట మహేష్
Previous
Next Post »