0

వరుణ్ ని కూడా బయపెట్టిన పూరి జగన్నాధ్

టాలీవుడ్ లో ఒకప్పుడు దర్శకుడు పూరిజగన్నాథ్ తో సినిమా చేయానుకునేవాళ్లు యంగ్ హీరోలు. కానీ ఇప్పుడు అప్ కమింగ్ హీరోలు కూడా ఆయన్ను వద్దంటున్నారు. కారణం దర్శకుడి తీరేనంటున్నారు. పూరిజగన్నాథ్ హీరోలను కొత్తగా చూపిస్తాడని అందరికీ తెలుసు. అందుకే ఆయన డైరక్షన్ లో మళ్లీ మళ్లీ సినిమా చేయటానికి హీరోలు ఆసక్తి చూపిస్తారు. కానీ ఇప్పుడు పూరితో సినిమా అంటేనే భయపడుతున్నారు. ఆగస్టులో చిరంజీవి 150 సినిమాను ప్రారంభించే ముందు సినిమాను తీయాలనుకున్నాడు పూరి జగన్నాథ్. కానీ ఆయనకు హీరో దొరకటం లేదు. నితిన్ తో సినిమా చేయాలనుకున్నా చివరి నిమిషంలో ఆగిపోయింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజతో సినిమా చేస్తున్నట్లు పూరి వెంటనే ప్రకటించాడు. కానీ ఇప్పటివరకు టెంకాయ కొట్టలేదు.

పూరి చెప్పిన కథ వరుణ్ కే కాదు మెగా తమ్ముడు నాగబాబుకు కూడా నచ్చలేదట. విషయం చెప్పకుండా క్రిష్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న కంచె సినిమాలో బిజీగా ఉన్నాడని డేట్స్ అడ్జస్ట్ చేయడం కుదరడం లేదని చెప్పారట. అందుకే సినిమా ఆలస్యమవుతోందంటున్నారు. మరోవైపు పూరితో సినిమా చేసే కన్నా హీరోగా పరిచయం చేసిన శ్రీకాంత్ అడ్డాలతో మరో సినిమా చేయడం బెటరని కుర్రాడి ఫీలింగ్ అట. లెక్కలు చూసుకుంటే పూరి- ప్రిన్స్ సినిమా ఆగిపోయినట్టేనని గుసగుసలు ఫిలింనగర్ లో హడావుడి చేస్తున్నాయి
Previous
Next Post »

ConversionConversion EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng