0

ఈ రోజే బహుబలి గిన్నిస్ బుక్ లోకి ....


ప్ర‌భాస్ - రాజ‌మౌళిల క‌ల‌ల చిత్రం బాహుబ‌లి... అద్భుతాల సాధ‌న దిశ‌గా అడుగులు వేస్తోంది. సినిమా విడుద‌ల‌య్యాక‌... `బాహుబ‌లి` ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో తెలీదుగానీ.. ముందే బ్ర‌హ్మాండం బ‌ద్ద‌లుకొడుతోంది. శాటిలైట్ రూపంలో, ఆడియో హ‌క్కుల రూపంలో,  ఏరియాల రైట్స్ రూపంలో ఇప్ప‌టికే బాహుబ‌లి రికార్డుల మోత మోగించిన బాహుబ‌లి ఇప్పుడు గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లోకి ఎక్క‌బోతోంది. 

బాహుబ‌లి మ‌ల‌యాళ వెర్ష‌న్ ఆడియో ఈరోజు (శ‌నివారం) కేర‌ళ‌లో విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా కొచ్చిలో ఓ భారీ పోస్ట‌ర్‌ని ఆవిష్క‌రించ‌బోతున్నాడు. ఇది ప్ర‌పంచంలోనే అతి పెద్ద పోస్ట‌ర్ అట‌. ఈ పోస్ట‌ర్‌ని చూడ్డానికి గిన్నిస్ బుక్ ప్ర‌తినిథులు వ‌స్తున్నార‌ట‌. వాళ్లు గ‌నుక ఇదే అత్యంత పెద్ద పోస్ట‌ర్ అని భావిస్తే... బాహుబ‌లి గిన్నిస్ బుక్ ఎక్కేస్తుంది.
Previous
Next Post »