సోషల్ మీడియా వచ్చిన తరువాత తమలోని
టాటెంట్ ను రుజువు చేసుకునేందుకు ఎందరెందరో పోటీ పడుతున్నారు. వీరిలో పట్టుమని పదేళ్లు
కూడా నిండని ఇద్దరు చిన్నారులు తెలుగులో అత్తాకోడళ్లుగా నటించిన వీడియో ఇప్పుడు సోషల్
మీడియాలో హల్ చల్ చేస్తోంది. తొమ్మిదేళ్ల రమ్యశ్రీ అప్పడే గడసరి అత్త అవతారమెత్తింది.
ఐదేళ్లు కూడా లేని చిన్నారి బుడత యోఘ కొడలు రక్తి కట్టించింది. ఈ ఇద్దరు చిన్నారులు
నటించిన అత్తాకోడళ్ల వీడియోకే తెలుగు ప్రజల నుంచి అభినందనలు వెల్లివిరుస్తున్నాయి.
అత్తకోడళ్లుగా రమ్యశ్రీ, యోధలు చక్కటి
హావభావాలు పలికిస్తున్న వీడియో ఎంతలా ప్రాచుర్యం పోందిందంటే.. కేవలం రెండు రోజుల్లో
ఈ వీడియోకు రెండు లక్షల హిట్స్ వచ్చాయి. కాస్త బోద్దుగా వున్న రమ్యశ్రీ అత్త పాత్రలో,
ఇమిడిపోగా, బక్క పలుచుగా, కువన్న యోదా కోడలిగా ఇట్టే కుదిరిపోయారు. వీరిద్దరి మధ్య
అత్తాకోడళ్ల సంబాషణలు రియల్ లైఫ్ గాధల కంటే ఆసక్తిగా వున్నాయి. వీరిద్దరి నటనకు ముగ్గుడయిన
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వారికి ఫోన్ చేసి మరీ ప్రశంసలతో ముంచెత్తారు.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon