0

భగవంతుణ్ణి దేవాలయం నుండి ఖాళీ చేయమని నోటీసులు



భోపాల్: దేవుడికి నోటీసులు జారీ చేసిన సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఈ పరిణామాన్నిచూసిన భక్తులు అవాక్కయ్యారు. వివరాలిలా ఉన్నాయి. 

మధ్యప్రదేశ్‌లోని బింధ్ జిల్లాలో రోడ్డుపై ఉన్న ఆక్రమణలను తొలగించాలంటూ గ్వాలియర్ హైకోర్టు ఆదేశాలు వెల్లడించింది. ఇందులో భాగంగా మున్సిపల్‌ అధికారులు రోడ్డు ఆక్రమణలకు అడ్డంకిగా ఉన్నా వారికి నోటీసులు జారీ చేస్తూ ఉంటారు. బింధ్ జిల్లాలోని బజారియా ఏరియాలో రోడ్డు ప్రక్కన హనుమంతుడి ఆలయం ఉంది. 

రోడ్డు స్థలం కొంచెం ఆలయ ప్రాంగణంలో కలవడంతో అధికారులు ఈ మేరకు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు హనుమంతుడికి జారీ అయ్యాయి. రోడ్డును ఆక్రమించుకున్న మీరు వెంటనే ఖాళీ చేయడంటూ ఈ నోటీసులో పేర్కొన్నారు. హనుమాన్ గుడికి నోటీసులు జారీ చేశామని తెలుసుకున్న మున్సిపల్ అధికారులు ఖంగుతిన్నారు. 

అనంతరం మున్సిపల్ అధికారులు గ్వాలియర్ హైకోర్టు ఆదేశాల మేరకే రోడ్డుపై ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు నోటీసులు ఇచ్చామని, ఏదో తప్పిదంగా హనుమాన్ గుడికి నోటీసులు వచ్చాయని తెలిపారు. ఈ నోటీసులను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. 


Previous
Next Post »