బొగోటా: కొలంబియాలో ఓ అద్భుత ఘటన చోటు చేసుకుంది. విమానం కూలిపోయిన 5 రోజుల తర్వాత దానిలో ప్రయాణించిన తల్లీ, కొడుకు క్షేమంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. వాయవ్య కొలంబియాలో దట్టమైన అటవీ ప్రాంతంలో గత శనివారం ఓ చిన్న విమానం కుప్పకూలిపోయింది.
ఈ ప్రమాదంలో పైలట్ మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని సహాయక సిబ్బంది ఘటనా స్థలం నుంచి స్వాధీనం
చేసుకున్నారు. అయితే అందులో ప్రయాణికుల గురించి అడవిలో 14 మంది సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.
ప్రమాదం జరిగిన అయిదురోజుల తర్వాత స్వల్ప గాయాలతో వున్న 18ఏళ్ల మురిల్లో అనే మహిళను, ఆమె ఏడాది వయసులోపు చిన్నారి కొడుకును సిబ్బంది గుర్తించారు. వారిని హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించారు.
ఐదు రోజులపాటు వారు ఆ దట్టమైన అడవిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించారు. బాబుకు ఎలాంటి గాయాలు కాకపోగా, తల్లికి మాత్రం చిన్న చిన్న దెబ్బలు, కాలిన గాయాలు అయ్యాయి.
విమానం వాయువ్య కొలంబియాలోని నుఖి నుంచి ఖిబ్డోకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద ప్రమాదం అనంతరం.. అదీ అయిదు రోజుల తర్వాత తల్లీ, బిడ్డలు క్షేమంగా బయటపడటం అద్భుతమని, అరుదైన ఘటన అని అక్కడి అధికారులు పేర్కొన్నారు.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon