0

కాజల్ అగర్వాల్ అలా కూడా సంపాదిస్తోందట ...!

సౌత్ సక్సెస్ భామ కాజల్ అగర్వాల్ టెంపర్ తర్వాత తెలుగులో మళ్లీ అవకాశాన్ని అందుకుంది. నాలుగు నెలల గ్యాప్ తర్వాత కాజల్ బ్రహ్మోత్సవం సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. మహేష్ సరసన రెండోసారి హీరోయిన్ గా సెలక్ట్ అయ్యింది కాజల్. అటు కోలీవుడ్ లో ధనుష్, విశాల్, విజయ్ సరసన నటిస్తోంది. ఇక బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తోంది. ఇలా బాలీవుడ్ , కోలీవుడ్ , టాలీవుడ్ లో కాజల్ బిజీగా ఉంది. టెంపర్ తర్వాత కాజల్ కు అవకాశాలే లేవనుకుంటున్న టైంలో అనుకోకుండా మహేష్ సరసన నటించే ఛాన్స్ అందుకుంది.

అయితే ఈ భామ సినిమాలతో పాటు యాడ్స్ కూడా చేస్తోందన్న విషయం తెలిసిందే. అయితే మొన్నటివరకు చేతిలో ఆఫర్లు లేని టైంలో ఈ భామ పలు ఫోటోషూట్లకు అగ్రిమెంట్ కుదుర్చుకుందట. అసలు ఈ ఫోటోషూట్లకే సమయం ఎక్కువగా కేటాయించాలని నిర్ణయించిందట కాజల్. ఎందుకు అమ్మడు ఈనిర్ణయం తీసుకుంది అంటే.. నెలల తరబడి ఓ సినిమాకు పనిచేస్తే ఇచ్చే పారితోషకం కన్నా రెండు మూడు గంటలు ఫోటో షూట్లకు కేటాయించే సమయమే తక్కువట. అంతేకాదు డబ్బు కూడా ఎక్కువగా వస్తోందట. ఈ లెక్కలు చూసుకున్న అమ్మడు సినిమాలకన్నా ఫోటోషూట్లే బెటరనిభావిస్తోందట.అసలు ఓ రకంగా సినిమాల్లో ఛాన్స్ రావడానికి కారణం ఫోటో షూట్లే అంటున్నారు. 30 ఏజ్ లోకూడా ఇంకా తగ్గని అందాలు దర్శక-నిర్మాతలను ఆకర్షిస్తున్నాయట. అందుకే అమ్మడి కోసం వెంటపడుతున్నారని ఫిలింనగర్ టాక్.


Previous
Next Post »

ConversionConversion EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng