0

అవకాశాలు లేక, ప్రముఖ సింగర్ ఆత్మహత్య


చండీగఢ్: అవకాశాలు తగ్గిపోయాయని జీవితంపై విరక్తి పెంచుకున్న వర్దమాన గాయకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పంజాబ్ లో జరిగింది. పంజాబ్ లోని భటిండాలో నివాసం ఉంటున్న వర్ధమాన గాయకుడు ధరం ప్రీత్ సింగ్ (38) ఇంటిలో ఆత్మహత్య చేసుకున్నాడు. 

పంజాబీ గాయకుడు ధరం ప్రీత్ సింగ్ అనేక పాటలు పాడి అతి తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. బిలాస్ పూర్ అనే గ్రామంలో పేద కుటుంబంలో జన్మించిన ధరం ప్రీత్ సింగ్ చిన్నప్పటి నుండి పెద్ద గాయకుడు కావాలని కలలుకనేవాడు. తరువాత సంగీతం మీద మంచి పట్టు సాదించాడు. 

15 ప్రయివేట్ ఆల్బంలు విడుదల చేశాడు. 2010వ సంవత్సరంలో ధరం ప్రీత్ సింగ్ చివరి ఆల్బం విడుదల అయ్యింది. తరువాత ఒక్క ఆల్బం కూడా బయటకు రాలేదు.


ధరం ప్రీత్ సింగ్ ఆల్బంలు గ్రామీణ ప్రాంతాలలో మంచి ఆదరణ పొందాయి. అప్పటి నుండి తనకు అవకాశాలు రావడం లేదని తల్లి, భార్యకు చెప్పి ఇంటిలోనే కుమిలిపోయేవాడు. ఆదివారం రాత్రి అమృత్ సర్ లో జరిగిన ఒక ప్రదర్శన ముగించుకుని ఇంటికి వెళ్లాడు. 

సోమవారం ఎంత సేపటికి గదిలో నుండి బయటకురాకపోవడంతో అతని తల్లికి అనుమానం వచ్చి చుట్టు పక్కల వారి సహాయంతో తలుపులు పగలగొట్టి చూడగా ధరం ప్రీత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసిందని పోలీసులు చెప్పారు. 

ఆత్మహత్య చేసుకున్న సమయంలో ధరం ప్రీత్ సింగ్ భార్య, పిల్లలు బయటకు వెళ్లారని పోలీసులు తెలిపారు. రోజు పైకి చూస్తు ఈ సీలింగ్ ఫ్యాన్ ఎప్పుడో ఒక సారి నన్ను చంపేస్తుందిలే అని అంటుండేవాడని ధరం ప్రీత్ సింగ్ తల్లి విలపిస్తున్నారు.


Previous
Next Post »