0

కేఎఫ్ సి లో వచ్చింది ఎలుక కాదు


యూఎస్ లోని ఓ కేఎఫ్ సి లో వచ్చింది ఎలుక కాదని, చికెనేనని ఆ సంస్ద స్పష్టం చేసింది. అందుకు ఆధారాలు కూడా చూపింది. కాగా ఓ వినియోగదారుడు కేఎఫ్ సి నుంచి చికెన్ ఆర్డర్ చేయగా ఎలుక వచ్చిందని ఫోటోలు తీసి సామాజిక వెబ్ సైట్ లలో ఉంచాడు. అంతేకాదు తాను చికెన్ ముక్కను కొరికినప్పుడు అది గట్టిగా ఉండటం తో నిశితంగా పరిశీలించగా అది ఎలుకగా తేలిందని వినియోగదారుడు తెలిపాడు. అయితే ఈ వార్తను కేఎఫ్ సి కొట్టేసింది తాము వినియోగదారులకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నామని, అది ఎలుక కాదని చికెనేనని స్పష్టం చేసింది. చికెన్ యొక్క చర్మం ఎలుక తోక ఆకారం లో వచ్చిందని అంతమాత్రాన అది ఎలుక కాదని తెలిపింది. ఈ వ్యవహారం పై సామాజిక వెబ్ సైట్ లలో పోస్ట్ చేసిన వినియోగదారున్ని కేఎఫ్ సి సంప్రదించడానికి ప్రయత్నించగా అతడు అందుబాటులోకి రావడం లేదని కేఎఫ్ సి స్పష్టం చేసింది.

ConversionConversion EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng