0

అనగనగ ఓ రాజు..ఆ రాజుకు వందమంది భార్యలు..!


ఆఫ్రికా ఖండంలో కామెరూన్ అనే దేశం ఉన్నది. ఆ దేశంలో బఫుత్ అనే ఒక ప్రాంతం ఉన్నది. ఆ ప్రాంతాన్ని అబుంబీ II అనే రాజు పరిపాలిస్తున్నాడు. అబుంబీ పరిపాలించే బఫుత్ రాజ్యంలో బహు భార్యత్వం తప్పు, నేరం కాదు. అయితే మాకేంటి అంటారా.. అక్కడే ఉన్నది అసలు సంగతి. బఫుత్ పాలకుడు అబుంబీ II కి ఏకంగా వంద మంది భార్యలున్నారు. వందమంది భార్యలు కలిగున్న మన అబుంబీ II గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించాడు. అసలు ఇంతమందిని ఎలా చేసుకున్నాడనే డౌట్ రావొచ్చు. దానికి ఇప్పుడు క్లారిఫికేషన్ ఇద్దాం.

బఫుత్ రాజ్యంలో ఒక విచిత్రమైన ఆచారం ఉన్నది. అదేంటంటే.. పాలకుడిగా ఉన్న రాజు మరణం తరువాత ఆయనకు సంబంధించిన ఆస్తీ, రాజ్యపాల అంతా యువరాజుకు దక్కుతుంది. ఇక ఆస్తీ, రాజ్యపాలనతో పాటు ఆ రాజుగారి యొక్క భార్యలు కూడా యువరాజుకు భార్యలుగా మారిపోతారట. ఈ ఆచారం ఆ బఫుత్ రాజ్యంలో ఎన్నో సంవత్సరాల తరబడి ఆచారంగా వస్తూనే ఉన్నది. ప్రస్తుతం బఫుత్ రాజ్యానికి రాజుగా ఉన్న అబుంబీ II 38 మందిని పెళ్లి చేసుకోగా, మరో 72 మంది సవతి తల్లులు అతనికి భార్యలుగా మారిపోయారు.
ఔరా..! అది తప్పుకదా అంటే.. మనకు తప్పే కావొచ్చు.. కాని అక్కడ అది ఆచారం. ఎవరి ఆచారాలను ఎవరు కాదనలేరు కదా. అయితే, ముసలి రాణులు యువరాజుకు పాలనా వ్యవహారాలు ఎలా చూసుకోవాలి అనే విషయాన్నీ నేర్పిస్తే.. యువరాణులు అంతపురంలో ఎలా వ్యవహరించాలి అనే విషయాలను నేర్పుతారట. మొత్తంగా మన అబుంబీ II సంతానంతో కలిపి 500 మంది అంతపురంలో నివాసం ఉంటున్నారట. రాజు తలుచుకుంటే దేనికైనా కొదవేముంది చెప్పండి. అంతేమరి.


Previous
Next Post »