లండన్: గాలిలో ఎగురుతున్న విమానం ఒక్క సారిగా ఎయిర్ పోర్టు చేరుకుంది. వెనక్కి తిరిగి వచ్చిన విమానంలో పరిశీలించిన అధికారులు చివరికి షాక్ కు గురైనారు. విమానం వెనక్కు తిరిగిరావడానికి ఒక తేనెటీగ కారణం అని తెలుసుకున్న ప్రయాణికులు నవ్వుకున్నారు. యుకే లోని సౌథాంప్టన్ నుండి డబ్లిన్ కు ఫ్లై బీ విమానం బీఈ 384 బయలుదేరింది. టేక్ ఆఫ్ అయిన 10 నిమిషాల తరువాత విమానంలో ఏదో సాంకేతిక లోపం ఉన్నట్లు ఫైలెట్ కు అనుమానం వచ్చింది. వెంటనే విమానాశ్రయం అధికారులను సంప్రదించారు.
అధికారుల సూచన మేరకు మళ్లి సౌథాంప్టన్
ఎయిర్ పోర్టు లో అత్యవసరంగా విమానాన్ని దించివేశారు. ఏమి జరిగింది అని ప్రయాణికులు
ఆందోళన చెందారు. ఎయిర్ పోర్టు సిబ్బంది విమానంలో అణువణువు క్షుణ్ణంగా పరిశీలించారు.
విమానం లోపల ఒక తేనెటీగ చిక్కుకున్న విషయం గుర్తించి దానిని తీసివేశారు. ఎలాంటి సాంకేతిక
లోపం లేదని గుర్తించిన తరువాత రెండు గంటలు ఆలస్యంగా విమానం డబ్లిన్ బయలుదేరింది. ప్రయాణికుల
క్షేమం మాకు ముఖ్యమని ఆలస్యం అయినందుకు చింతిస్తున్నామని ఫ్లై బీ సంస్థ ప్రకటించింది.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon