నడిరోడ్లపై రౌడీలు కత్తులు, కర్రలతో వీరంగం చేస్తున్నారు. యువకుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. తెలుగు సినిమాల్లో కనిపించే ఈ దృశ్యం.. నెల్లూరులోని కనకమహల్ సెంటర్‌లో కనిపించిన రియల్ సీన్ ఇది.
నెల్లూరులోని నడిరోడ్డుపై రౌడీలు వీరంగం సృష్టించారు. ఓ యువకుడు మరో యువకుడిపై కత్తితో దాడికి దిగాడు. ఐతే మరో ఇద్దరు యువకులు అక్కడికి వచ్చి అతడ్ని వారించేందుకు ప్రయత్నించారు. కత్తులతో ఎవరు ఎవరిపై దాడి చేస్తున్నారో తెలియక భయంతో ప్రజలు తలో దిక్కుకు పారిపోయారు. ట్రంక్ రోడ్డులో జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది. దీనిపై ఆ జిల్లా ఎస్పీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ యవ్వారంపై విచారణకు ఆదేశించారు. వెంటనే స్పందించిన పోలీసులు, వీడియోల ఆధారంగా ముగ్గురు రౌడీ షీటర్లను గుర్తించి కేసులు నమోదు చేశారు. పనిలోపనిగా పాత నేరస్తులపై కూడా దృష్టిపెట్టారు.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon