కాలేజ్ క్యాంపస్ గోడల్ని దాటింది ర్యాగింగ్ భూతం. హైదరాబాద్‌లో నడిరోడ్డుపై శివ సినిమాను తలపించారు కొంతమంది విద్యార్థులు. రెస్పెక్ట్ విషయంలో రాజీపడేది లేదంటూ రచ్చరచ్చచేశారు. ఈ తతంగమంతా ఓ హోటల్‌లోవున్న సీసీ కెమెరాల్లో రికార్డుకావడంతో ర్యాగింగ్ గుట్టురట్టయింది.
అల్వాల్‌లోని లయోలా అకాడమీకి చెందిన కొంతమంది సీనియర్ విద్యార్థులు మూకుమ్మడిగా ఓ జూనియర్ స్టూడెంట్‌పై దాడి చేశారు. పిడిగుద్దులు కురిపిస్తూ, కిందపడేసి వీరకుమ్ముడు కుమ్మారు. అదేపనిగా కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఈ విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మూడురోజుల కిందట జరిగిన ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూనియర్స్ తమకు రెస్పెక్ట్ ఇవ్వడంలేదంటూ సీనియర్లు రగిలిపోయారు. దాడి అనంతరం తమకేం తెలియనట్టుగానే రన్ రాజా రన్ అంటూ ఎస్కేప్ అయ్యారు. సమాచారం అందుకున్న కాలేజి యాజమాన్యం 12 మంది విద్యార్థులను సస్పెండ్ చేసింది. కానీ పోలీసులకు మాత్రం ఫిర్యాదు చేయలేదు. ఐతే, ర్యాగింగ్ వ్యవహారంపై కాలేజీ యాజమాన్యం గోప్యంగా వుంచడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon