అవును… భూమి ఏర్పడి లక్షల సంవత్సరాలైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు
భూగ్రహం అనేక మార్పులు చెందుతూ వస్తున్నది. నీరు, గాలి, వాతావరణం వంటివి
ఏర్పడ్డాయి. ఆ తరువాత భూమిపై జీవం ఏర్పడింది. ఆ జీవం చివరకు మనిషిగా రూపాంతరం
చెందిన సంగతి విదితమే. మనిషి ఈ విశాలమైన భూమిపై మనగడ సాగించడం మొదలుపెట్టాక,
క్రమక్రమంగా టెక్నాలజీని అందుకున్నాడు. ఇప్పుడ ఈ నవీన మానవుడు ఇక్కడి నుంచి
వేరేగ్రహాలమీదకు అవలీలగా వెళ్ళగలుగుతున్నాడు. ఎటువంటి టెక్నాలజీని అందుకున్న,
ప్రకృతిలో సంభవించే విపత్తుల నుంచి మాత్రం తప్పించుకోలేక పోతున్నాడు అన్నది సత్యం.
అందుకు 2004లో వచ్చిన సునామి కావొచ్చు, ఇటీవలే నేపాల్ దేశంలో సంభవించిన భయంకర
భూకంపం కావొచ్చు. ప్రకృతిలో సంభవించే విపత్తుల నుంచి తప్పించుకోలేకపోతున్నాడు.
ఇకపోతే, ఈ జూన్ 28న భూమికి మరో
ప్రమాదం పొంచివున్నట్టు తెలుస్తున్నది. భగభగ మండే సూర్యుడి నుంచి సౌరతుఫాను భూమి
వైపుకు దూసుకు వస్తున్నదట. ఇటువంటి సౌర తుఫాను గతంలో వచ్చేవి. కాని, ఇప్పుడు,
వస్తున్న సౌర తుఫాను గతంలో వచ్చిన దానికంటే తీవ్రంగా ఉండబోతున్నదని తెలుస్తున్నది.
ఈ సౌర తుఫాను వేగంగా భూమివైపు దూసుకొస్తున్నదని, జూన్ 28న ఈ సౌర తుఫాను భూమిని
తాకే అవకాశం ఉందని అమెరికా అంతరిక్ష శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇదికనుక భూమిని
తాకితే.. భూమిపై నున్న విధ్యుత్, ఇంటర్నెట్, మొబైల్ వంటి సేవలు నిలిచిపోయే ప్రమాదం
ఉన్నదని అంటున్నారు. ఇక ఈ సౌర తుఫాను గంటకు 16 లక్షల, 9వేల 347 కిలోమీటర్ల వేగంతో
భూమివైపు దూసుకొస్తున్నదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇక, ఈ సౌర తుఫానును కేవలం
30 నిమిషాల ముందు మాత్రమే గుర్తించగలమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon