0

ఆరేళ్ల బాలికను వివాహమాడిన వార్డు మెంబర్

జైపూర్: ప్రజాప్రతినిధిగా ఆదర్శంగా ఉండవలసిన ఓ గ్రామ వార్డు సభ్యుడు బాల్య వివాహం చేసుకున్నాడు. రాజస్థాన్‌లోని చిత్తోడ్‌గఢ్ జిల్లా గాంగ్రర్ గ్రామపంచాయతీ సభ్యుడు రతన్‌ లాల్ జాట్(35) వారం క్రితం ఆరేళ్ల బాలికను వివాహమాడినట్లు అధికారులు తెలిపారు.
సంచలనం సృష్టించిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చిత్తోడ్‌గఢ్ జిల్లా అధికారులు తెలిపారు. శుక్రవారం ఈ బాల్య వివాహం ఫొటో ఒకటి వాట్సప్‌లో హల్‌చల్ చేయడంతో విషయం అందరికీ తెలిసిందని జిల్లా కలెక్టర్ వేద్ ప్రకాశ్, ఎస్సీ ప్రసన్న కుమార్ ఖామెసారా తెలిపారు.
గాంగ్రార్ పంచాయతీ వార్డు సభ్యుడు రతన్ జాట్ ఆరేళ్ల బాలికను పాండోలి లేదా సొనియానా గ్రామంలో ఈ వారం మొదట్లో వివాహం చేసుకున్నట్లు తేలింది. బాల్యవివాహ నిషేధ చట్టం-2006 కింద వార్డు మెంబర్‌తోపాటు బాలిక కుటుంబంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు.
జాట్‌ను త్వరలో అదుపులోకి తీసుకుంటామన్నారు. ఈ వివాహం చెల్లదని సోమవారం స్థానిక కోర్టులోనూ కేసు వేయనున్నట్లు జిల్లా కలెక్టర్ వేద్ ప్రకాశ్ తెలిపారు.
Previous
Next Post »

ConversionConversion EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng