0

'హిందూ పేపర్ చదివే వరుడు కావలెను'

ముంబై: 'టైమ్స్ ఆఫ్ ఇండియా' మళ్లీ మరో కొత్త వివాదంలో ఇరుక్కుంది. 'టైమ్స్ ఆఫ్ ఇండియా' కాస్మో‌పాలిటన్ క్లాసిఫైడ్స్ విభాగంలో తాను వివాహం చేసుకునేందుకు హిందూ పేపర్ చదివే అబ్బాయి కావాలని ఒక ప్రకటన వచ్చింది. ఆ యాడ్‌లో 'హిందూ పేపర్ చదివే వరుడు కావలెను. ఎందుకంటే హిందూ నిజాయితీని ప్రదర్శిస్తుంది. క్లుప్తంగా, చక్కగా వార్తలుంటాయి. వారు తాము ప్రచురించే ప్రకటనలను ముందు చదివి ఆ తర్వాత పోస్ట్ చేస్తారు' అని ఉంది.

ఈ ప్రకటనను 'టైమ్స్ ఆఫ్ ఇండియా' ఉద్యోగులు ఏ మాత్రం చూడకుండా, ఎడిట్ చేయకుండా క్లాసిపైడ్స్‌లో ప్రకటించడం విమర్శలకు దారి తీస్తోంది. గతంలో కూడా డెక్కన్క్రానికల్‌లో వచ్చిన క్లాసిఫైడ్స్ ప్రకటనలను ఉన్నవి ఉన్నట్టుగా 'టైమ్స్ ఆఫ్ ఇండియా'లో ప్రచురించింది. ఈ కాపీ ప్రకటనలపై 'టైమ్స్ ఆఫ్ ఇండియా' కోర్టులో కేసుని కూడా ఎదుర్కొంది.






Previous
Next Post »