ఓ ప్రేమ జంటను చిత్రహింసలకు గురిచేసి చివరకు ఆ జంటతో గ్రామస్థులు
మూత్రం తాగించారు. దీనికి కారణం ఈ ప్రేమ జంట వివాహ బంధాన్ని అపహాస్యం చేశారన్న
అక్కసుతో ఈ పని చేయించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా, తాజాగా
వెలుగులోకి వచ్చింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని హోషంగాబాద్ జిల్లా, సింగోడా గ్రామానికి
చెందిన అక్షయ్ మోహ్రా అనే యువకుడు, మైదఖేడా గ్రామానికి చెందిన ఓ వివాహిత
ప్రేమించుకున్నారు. ఈ విషయం ఆమె భర్త రామ్ గోపాల్ ఠాకూర్‌కు తెలియడంతో ఆమెను
ఇంట్లో నిర్బంధించాడు. అయితే, ఆమె అతని కన్నుగప్పి పుట్టింటికి వెళ్లిపోయింది.
అక్కడ ఆమె ప్రియుడు అక్షయ్ మోహ్రాను వివాహం చేసుకుంది.
దీంతో వారిద్దరినీ గాలించి పట్టుకున్న మైదఖేడా గ్రామస్థులు
చిత్రహింసలకు గురిచేశారు. ఇద్దరినీ ఇనుపచువ్వలతో తీవ్రంగా గాయపరిచి.. వారి మెడల్లో
చెప్పుల దండలు వేసి గ్రామంలో ఊరేగించారు. ఆ తర్వాత వారిద్దరిచేత మూత్రం తాగించారు.
తీవ్రంగా గాయపడిన వారిని పోలీస్ స్టేషన్ ముందు పడేసి వెళ్లిపోయారు. దీంతో వారిని
ఆసుపత్రిలో చేర్చిన పోలీసులు, నలుగురు గ్రామస్థులను అదుపులోకి తీసుకున్నారు.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon