0

అక్కినేని ఫ్యామిలీ నుండి.... వీర్య దాత?


హైదరాబాద్: అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారిలో హీరో సుమంత్ ఒకరు. అయితే ఈ మధ్య కొంత కాలంగా సుమంత్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే త్వరలోనే ఆయన ఓ రీమేక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
హిందీలో సూపర్ హిట్టయిన ‘వికీ డోనర్' చిత్రం తెలుగు రీమేక్ లో సుమంత్ నటించబోతున్నట్లు సమాచారం. హిందీలో సూజిత్ సర్కార్ దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా, యామి గౌతం ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం అక్కడ మంచి విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సుమంత్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సినిమా రీమేక్ రైట్స్ కోసం సుమంత్ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా రైట్స్ ఇప్పటికే ఓ తెలుగు నిర్మాత సొంతం చేసుకున్నాడు. సదరు నిర్మాతతో సుమంత్ సంప్రదింపులు జరుపుతున్నట్లు చెబుతున్నారు.
అన్ని ఓకే అయితే త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. అయితే దర్శకుడు ఎవరు? హీరోయిన్ ఎవరు? ఎవరు నిర్మించబోతున్నారు? అనే విషయాలు త్వరలోనే బయటకు రానున్నాయని అంటున్నారు.
Previous
Next Post »