అనంతపురం: మహిళలు స్నానం చేసే బాత్
రూంలో స్పై కెమెరాలు ఏర్పాటు చేసి ఆ దృశ్యాలు రికార్డు చేసి బ్లాక్ మెయిల్
చేస్తున్న నిందితుడిని ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా పోలీసులు అరెస్టు చేసి
విచారణ చేస్తున్నారు. నిందితుడికి సహకరించిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
అనంతపురం జిల్లాలోని గుంతకల్ లో ఆర్టీసీ బస్ స్టాండ్
సమీపంలో ఒక కళ్యాణ మండపం (పరిటాల శ్రీరాములు కళ్యాణ మండపం) ఉంది. గుంతకల్ లోని
హౌసింగ్ కాలనీలో నివాసం ఉంటున్న ఒక యువతి వివాహం గత నెలలో అదే కళ్యాణ మండపంలో
జరిగింది.
ఆ సందర్బంలో పెళ్లి కుమార్తె బంధువులు చాలా మంది
వివాహానికి హాజరైనారు. పెళ్లికి ముందు రోజు గుంతకల్ నివాసి రామకృష్ణ అనే వ్యక్తి
బాత్ రూంలో స్పై కెమెరాలు ఏర్పాటు చేశాడు. తరువాత పెళ్లికి వెళ్లిన చాలా మంది
మహిళలు ఆ బాత్ రూంలో స్నానాలు చేశారు.
తరువాత శుభకార్యం పూర్తి కావడంతో ఎవ్వరిదారిన వారు వెళ్లి
పోయారు. బాత్ రూంలోని స్పై కెమెరా తీసుకున్న నిందితుడు అందులోని అందమైన మహిళలు
స్నానం చేస్తున్న దృశ్యాలను సీడీలలో రికార్డు చేశాడు. పెళ్లి కుమార్తె కుటుంబ
సభ్యులు పంచి పెట్టిన పెళ్లి పత్రిక తీసుకున్నాడు.
అందులో ఉన్న ఫోన్ నెంబర్లకు కాయిన్ బూత్ ల నుండి ఫోన్
లు చేశాడు. తన దగ్గర పెళ్లి కుమార్తె తో సహా మీ కుటుంబ సభ్యులు, బంధువులు స్నానాలు
చేస్తున్న వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయని, రూ. 5 లక్షలు ఇవ్వకుంటే సోషల్ మీడియాలో
పోస్ట్ చేస్తానని బెదిరించాడు.
కాయిన్ ఫోన్ ల నుండి ఫోన్ లు రావడంతో బాధితులు
అనంతపురం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పోలీసులు రామకృష్ణను అరెస్టు చేసి
సీడీలు, స్పై కెమెరాలు స్వాదీనం చేసుకున్నారు. కళ్యాణ మండపం నిర్వహకులను విచారణ
చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon