0

సెక్స్ కోసం కండోమ్ తెచ్చుకోమని తుర్రుమనింది


ఆమె పేరు ఖుష్బూ శర్మ.. అలియాస్ స్మృతి శర్మ.. అలియాస్ లేడీ కోకోవా.. పేరు ఏదైతేనేం.. మాయలాడి.. వగలాడి.. కిలాడీ.. ఇలా ఎన్నయినా చెప్పవచ్చు. రాజస్థాన్‌లో పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన ఈవిడగారి దగాకోరు లీలలు ఇన్నీ అన్నీ కావు. 

లగ్జరీ హోటళ్ళలో దిగి ఎంజాయ్ చేసి బిల్లులు చెల్లించకుండా ఎగగొట్టి తుర్రుమనడం.. కార్లలో లిఫ్ట్ అడిగి డ్రైవర్లకో, యజమానులకో మస్కా కొట్టి వాళ్ళ కార్లనే దొంగిలించి పరారు కావడం ఈమె దందా.అంతే కాదు.. ఫేస్‌బుక్‌లో తానో ఐఏఎస్ ఆఫీసర్‌నని, తనతో లంచ్‌కో, డిన్నర్‌కో  రావాలని మగాళ్ళను కోరి వాళ్ళు వచ్చాక వారి దగ్గర డబ్బులు గుంజి రేప్‌కేసు పెడతానని బెదిరించి పారిపోవడం ఖుష్బూశర్మ నైజం.. ఈ మధ్య జైపూర్‌లో ఓ కారులో వెళ్తున్న వ్యక్తిని లిఫ్ట్ అడిగి అతడ్ని బుట్టలో వేసుకుంది. తనతో సెక్స్ చేయాలనుకుంటే కండోమ్ తెచ్చుకోమని చెప్పడంతో అతగాడు సంతోషంతో ఉబ్బితబ్బిబై ఓ మెడికల్ షాపు దగ్గర కారు ఆపగానే అతడి కారుతో ఉడా యించేసింది. ఇలా దొంగిలించిన కార్లను అమ్మేసుకుని జల్సాలు చేసేదట..ఈమెపై పలు పోలీసుస్టేషన్లలో కేసులు దాఖలయ్యాయి. ఇలా దాదాపు వందమందిని ఈ లేడీ కిలాడీ మోసగించింది. చివరకు గత మే 29 న తాను చోరీ చేసిన కారులో పరారవుతుండగా పోలీసులకు తెలిసి ఆ కారును చేజ్ చేసి అతికష్టం మీద ఆమెను పట్టుకోగలిగారు.


Previous
Next Post »