తన సహనటులు షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్‌లను విమర్శిస్తే ఊరుకునే
ప్రసక్తే లేదని బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన అభిమానులకు వార్నింగ్
ఇచ్చారు. అలా షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్‌లను విమర్శిస్తే ట్విట్టర్ ఖాతాను
మూసివేస్తానని సల్మాన్ ఖాన్ తెలిపారు.
గత మూడేళ్లుగా ముగ్గురు ఖాన్‌లూ కలిసిపోయారన్న సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో తన
ట్విట్టర్ ఖాతాలో కొందరు షారూఖ్, అమీర్ లను విమర్శిస్తూ ట్వీట్లు చేస్తుండటాన్ని
గమనించిన ఆయన కాస్తంత ఘాటుగానే స్పందించారు.
తప్పుడు గుర్తింపుతో ఖాతాలు తెరచిన వారే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారని
సల్మాన్ ఖాన్ తెలిపారు. అంతేగాకుండా గత రాత్రి పలు ట్వీట్లు చేశారు. హిందీ
చిత్రసీమలో 1,2,3 ర్యాంకులు లేవని, తామంతా ఒకటేనని అన్నారు.
అభిమానులు నియంత్రణ పాటించకుంటే తన ట్విట్టర్ ఖాతాను మూసేస్తానని హెచ్చరించారు.
అభిప్రాయాలు, ప్రేమను పంచుకోవడానికి మాత్రమే ట్విట్టర్‌ను వేదికగా చేసుకోవాలని
సూచించారు.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon