0

మనము ఎడమచేతి వైపే ఎందుకు పడుకోవాలి ?


మనం రోజూ మాములుగానే నిద్ర పోతాం. అయితే ఏ విధంగా పడుకోవాలి ? అంటే మనం పడుకునే విధానం ఎలా ఉంటే మంచిదో చాలామందికి తెలియదు. అయితే నిద్ర పోయేటప్పుడు పొజిషన్‌ ఎలా ఉండాలో వైద్యులు చెబుతున్నారు. ఎడమ చేతి వైపు పడుకోవటం మంచిదంటున్నారు ఆయుర్వేద వైద్యులు. 

ఎందుకు కుడి వైపు పడుకోకూడదు అంటే.మనం ఆహారం తీసుకున్న కొద్దిసేపటి తర్వాత పడుకుంటాం. మనంతిన్న ఆహారం అరగాలంటే జీర్ణశక్తి మంచిగా ఉండాలి. మన శరీరంలోని శోషరస గ్రంథులు లతో పాటు జీర్ణాశయం, మూత్రాశయం, క్లోమము కడుపుకు ఎడమవైపునే ఉంటాయి. మనం తిన్న వ్యర్థాన్ని బయటకొచ్చే సామర్థ్యాన్ని ఇవి కలిగి ఉండాలంటే వాటిపై ఎలాంటి ఒత్తిడి పడకుండా ఉండాలి. అందుకే ఎడమవైపు పడుకోవటం మంచిదని డాక్టర్ల సలహా ఇస్తున్నారు. 
Previous
Next Post »