0

ఫ్లిప్ కార్ట్ ఘనత: మొబైల్ ఆర్డర్ చేస్తే 2 మామిడి పళ్లు వచ్చాయి



కరీంనగర్: ఆన్‌లైన్‌లో మొబైల్ కోసం ఆర్డర్ చేస్తే మామిడి పళ్లు వచ్చిన సంఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. జిల్లాకు చెందిన శరణ్ అనే యువకుడు ప్రముఖ ఆన్ లైన్ మార్కెటింగ్ సంస్థ ఫ్లిప్ కార్ట్‌లో మొబైల్ ఫోన్ కోసం ఆర్డర్ ఇచ్చాడు. ఘనత 

మూడు రోజుల తర్వాత అతనికి ఓ కొరియర్ వచ్చింది. కొరియర్‌ను అతను విప్పి చూశాడు. అందులో చూడగా.. తాను ఆర్డర్ ఇచ్చిన మొబైల్ బదులు రెండు మామిడి పళ్లు వచ్చాయి.


దీంతో అతను కొరియర్ బాయ్‌ను అడిగాడు. అందులో ఏమి ఉంటుందో తెలియదని, వచ్చింది ఇవ్వడమే తమ పని అని అతను చెప్పారు. కార్యాలయంలోను అడిగాడు. దీని గురించి తెలుసుకుంటామని వారు చెప్పారు. 


అయితే, ఆ తర్వాత వారి నుండి స్పందన లేదు. సదరు యువకుడు ఇక ఏం చేయలేక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శరణ్ అప్పటికే క్రెడిట్ కార్డుతో ఆ మొబైల్ ఫోన్ కోసం డబ్బులు కూడా చెల్లించాడు. తాను మొబైల్ ఆర్డర్ చేస్తే రెండు మామిడి పళ్లు వచ్చాయని అతను వాపోయాడు.



Previous
Next Post »