తాను క్రీడాకారిణి అయినంత మాత్రాన తనకు మిగతా యువతుల వలె కోరికలు, ఆకాంక్షలు ఉండయని అనుకోవద్దని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అన్నారు. తాను క్రీడాకారిణిని అయినప్పటికీ అంతకంటే ముందు ఆడపిల్లనని చెప్పారు.
ఆమె ఢిల్లీలోని ఐఐజెడబ్ల్యూ ఫ్యాషన్ వీక్‌లో సంప్రదాయ దుస్తులు, నగలలో అలరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తనకు నగలు, దుస్తుల పైన ఇష్టం ఉండదని అనుకోవద్దని చెప్పారు.
అందరి అమ్మాయిల్లాగే తనకూ నగలు అంటే ఎంతో ఇష్టమని చెప్పారు. సానియా ఫ్యాషన్ షోను ఎంతో ఎంజాయ్ చేసానని చెప్పారు. ర్యాంప్ వాక్ తనకు కొత్త కాదన్నారు. గతంలో కూడా ర్యాంప్ వాక్ చేశానని చెప్పారు.
కాగా, భారత్ టెన్నిస్ స్టార్ సానియా మిర్జా సోమవారం జరిగిన అంతర్జాతీయ జ్యూయలరీ షోలో తళుక్కున మెరిసిన విషయం తెలిసిందే. ఇండియా ఇంటర్నేషనల్ జ్యూయలరీ వీక్ (ఐఐజెడ్ల్యు)లో భాగంగా ముంబైలో నిర్వహించిన ర్యాంప్ వాక్‌లో పాల్గొన్న సానియా ఫ్యాషన్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది.
నిండైన చీరకట్టు, స్లీవ్ లెస్ జాకెట్, మెడ చుట్టూ భారీ వజ్రాభరణాలు, తెలుగుదనం ఉట్టిపడేలా నడుముకు వడ్డాణం, కాళ్లకు హై హీల్స్‌తో మెరిసిపోయిన సానియా ఫ్యాషన్ దివాగా వెలిగిపోయింది. ఇండియా ఇంటర్నేషనల్ జ్యూయలరీ వీక్ ముగిసిన అనంతరం సానియా మిర్జా మాట్లాడుతూ తన స్నేహితురాలు మోనీ అగర్వాల్ కోరిక మేరకు ఈ షో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon