ఆమె... ఓ దేవతగా తనకు తాను ప్రకటించుకుంది. తాను స్వయంగా దేవతగా జనాలకు భలే కలరింగ్ ఇస్తుంది. మగ వారి చేత ముద్దులు పెట్టించుకోవడం.. వారి ఒడిలో ఊగడం అమ్మగారికి బాగా అలవాటు. ఇంతకీ అలాంటి మాతాశ్రీ ఎక్కడా అనుకుంటున్నారా..? పంజాబ్ రాష్ట్రంలో. అక్కడ చాలా మంది రాధే మా అనే దొంగస్వామినిని నమ్ముతారు. ఎంతో మంది భక్తులు అమ్మగారి ముందు భజన చేస్తారు డబ్బులున్న వారికి ఒకలా.. డబ్బుల్లేని వారిని ఒకలా ట్రీట్ చేస్తారు అమ్మగారు. వయస్సులో ఉన్న మగాళ్లు కనిపించినా... అమ్మగారికి మనసు వచ్చినా వెంటనే వాళ్ల ఒడిలో వాలిపోతారు. మామూలు స్థాయి నుంచి దేవత స్థాయికి ఎదిగిన రాధే మాకు సంబందించిన నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అమ్మగారు బాలీవుడ్ పాటలకు స్టెప్పులేస్తారు... చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని ఫోజులిస్తారు అయినా అమ్మగారు దేవత రూపమేనట. జాతీయ మీడియాలో అమ్మగారి బాగోతం మొత్తం బయటపడింది. మీడియా చానళ్లు అమ్మగారి నిర్వాకం మీద పంచ్ లు పేలుస్తున్నాయి.... మీడియా అమ్మగారిని ఉతికారేస్తోంది.
రాధే మా.. పేరు మాత్రం బాగా చక్కగా ఉంటుంది. కానీ ఆ పేరుతో ఈ అమ్మగారు చేస్తున్న నిర్వాకమే అందరికి విసుగుపుట్టిస్తోంది. అమ్మగారు బాలీవుడ్ పాటలు వేసే స్టెప్పులు చూస్తే దిమ్మతిరిగి బొమ్మ కనిపిస్తుంది. అమ్మగారి బర్త్ డే వేడుకలు చూడాలి.. సినిమా ఫంక్షన్ లలో హీరోయిన్ ఎంట్రీలకన్నా భారీగా ఉంటుంది. స్టేజ్ ల మీద భారీ హంగుఆర్భాటాలతో దిగడం... మైకంలో ఊగడం అమ్మగారికి పెట్టింది పేరు. అయితే తాజాగా అమ్మగారి ఫోటోలు కొన్ని బయటకు వచ్చాయి. చిన్న చిన్న గౌనులు వేసుకొని బాలీవుడ్ బీట్ లకు గార్డెన్ లో గెంతులు వేసే వీడియో అందరికి ఆశ్చర్యం కలిగించింది. ఇక అమ్మగారు ప్రముఖ పోర్న్ స్టార్ సన్నిలియోన్ ఫ్యాన్ కూడా. అవును మీరు చదివింది నిజం.. పోర్న్ స్టార్ సన్నీలియోన్ ఫ్యాన్ అట. మొత్తానికి రాధే మా లీలలు విన్నవారి చెవులు, చూసిన వారి కళ్లు మూసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ల వల్ల మతాలకు, దేవుళ్లకు చెడ్డపేరు వస్తోంది.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon