0

తీవ్ర ప్రమాదం నుండి బయట పడ్డ జెనీలియా !

తీవ్ర ప్రమాదం నుండి బయట పడ్డ జెనీలియా !
జెనీలియా సినిమాల నుండి దూరం అయి చాల సంవత్సరాలు అయిపోతున్నా ఆమెను అభిమానించేవారు ఇంకా చాలామంది ఉన్నారు. అటువంటి ఈ క్యూట్ హీరోయిన్ ఒక పెద్ద ప్రమాదం నుండి బతికి బయట పడింది. నిన్న సాయంత్రం థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ లో జరిగిన బాంబు పేలుళ్ల సంఘటనలో 27 మంది మృతిచెందిన విషయం తెలిసిందే.

బ్యాంకాక్ లోని ఒక హిందూ ఆలయం దగ్గరలో ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడు సంఘటనను ప్రత్యక్షంగా చూసిన సాక్షి జెనీలియా. ఈ పేలుడు సంభవిస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగిన స్థలానికి ఎదురుగా ఉన్న ఒక మాల్ లో జెనీలియా ఉంది. ఒక యాడ్ షూటింగ్ నిమిత్తం తన యూనిట్ సభ్యులతో ఈ మధ్యనే జెనీలియా తన భర్త రితీష్ దేష్ ముఖ్ తో కలిసి జెనీలియా బ్యాంకాంక్ వెళ్ళింది.

ఈ యాడ్ షూటింగ్ లో తాము బిజీగా ఉన్న సమయంలో తమ ఎదురుగానే భయంకరమైన శబ్దంతో పేలిన బాంబుల శబ్దాలను మంటలను తాను కళ్ళారా చూశానని భయంకరమైన ఆ సంఘటన నుండి బయట పడటం తన అదృష్టం అంటూ ట్విట్ చేసింది జెనీలియా.

రితీష్ దేష్ ముఖ్ ను పెళ్ళిచేసుకున్న తరువాత సినిమాలకు దూరమైన జెనీలియా మళ్ళీ యాడ్స్ లో నటించడానికి ముందుకు వచ్చిన సందర్భంలో అనుకోకుండా జరిగిన ఈ సంఘటన నుండి క్షేమంగా జెనీలియా బయట పడటం ఆమె అభిమాలందరినీ ఆనందపరుస్తోంది.. 
Latest
Previous
Next Post »