0

కప్పలను తిన్న హీరోయిన్

హీరోయిన్ సల్మా హయక్ ఎంచక్కా కప్పలను భోంచేసింది. కప్పలను మాత్రమేనా.. పట్టు పురుగులను కూడా మరమరాలు తిన్నట్టుగా తినేసింది ‘విల్ సల్మా ఈట్ ఇట్’ అనే టీవీ ప్రోగ్రాంలో పాల్గొన్న సల్మా హయేక్ బాగా దోరగా వేయించిన కప్పలను, అప్పుడే నూనెలో వేయించి తీసిన పట్టు పురుగులను తినేసింది. టీవీ ప్రోగ్రాం కోసం కాబట్టి తిన్నానుగానీ, నిజానికి వాటిని తింటున్నప్పుడు తనకు చాలా ఇబ్బందిగా అనిపించిందని సల్మా హయేక్ తర్వాత చెప్పింది. తాను మరోసారి ఇలాంటి వాటిని పొరపాటున కూడా తినబోనని చెప్పింది. అయితే సల్మా భర్త, ఫ్రెంచ్ వ్యాపారవేత్త ఫ్రాంకోయిస్ హెన్రీ మాత్రం తానయితే చికెన్‌ ఎంత ఇష్టంగా తింటానో కప్పలను కూడా అంతే ఇష్టంగా తింటానని చెప్పుకొస్తున్నాడు. ఇంకో రెండు మూడుసార్లు సల్మా కూడా కప్పల్ని తింటే వాటిలో వున్న రుచి తెలుసుకుంటుందని అంటున్నాడు.
Previous
Next Post »