0

దొంగా..దొంగా: మేకప్ లేని భార్యను చూసి అరిచిన భర్త

Groom Sues Bride For Trauma After Seeing Her Without Makeup
అల్జీరియా: మేకప్ లేకుండా తన భార్యను చూసిన కొత్తగా పెళ్లైన ఓ వ్యక్తి... ఆశ్చర్యపోవడమే కాకుండా ఆమె పైన మోసం కేసు పెట్టాడు. ఈ సంఘటన అల్జీరియాలో జరిగింది. మేకప్ ఆడవారిని చాలా ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తోంది. 

బొత్తిగా అందం లోపించిన అమ్మాయిలను సైతం మేకప్ సాయంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. అలాంటివారు మేకప్ తీసేస్తే ఎవరో కొత్త వ్యక్తుల్లా కనిపిస్తారు. అల్జీరియా వ్యక్తి కూడా ఇలాగే పొరబడ్డాడు. 

భార్యను చూసి దొంగనుకునుకున్నాడు. పెళ్లికి ముందు ఆమెను చూసిన సదరు వ్యక్తి ముచ్చటపడ్డాడు. మేకప్‌లో అందంగా కనిపించడంతో కాబోయే భార్య అందగత్తేనని అనుకున్నాడు.


పెళ్లిలోనూ ఫుల్ మేకప్‌తో ఆమె బాగానే కనిపించింది. అయితే, పెళ్లి అనంతరం కొత్త కాపురం మొదలుపెట్టేందుకు కొత్త నివాసానికి వెళ్లారు. ఆ మరుసటి రోజు ఆమె మేకప్ విషయం తెలిసిందే. 

తర్వాత రోజు ఉదయం నిద్రలేచి చూసిన అతగాడు పక్కన ఎవరో కొత్త మహిళ ఉన్నట్టు గుర్తించి, దొంగా.. దొంగా.. అని అరిచాడు. ఆ తర్వాత ఆమె తన భార్యేనని, మేకప్ తీసేసేసరికి అలా అసలైన గెటప్ కనిపించిందని అర్థం చేసుకొని, ఆ తర్వాత కోర్టుకు ఎక్కాడు. 

పెళ్లికి ముందు ఆమె తన మేకప్‌తో తనను వంచించిందని అన్నాడు. ఆమె చాలా అందంగా ఉందని భావించానని, కానీ ఉదయాన్నే లేచేసరికి చూసి ఆశ్చర్యపోయానని చెప్పాడు. ఆమెను దొంగగా భావించానని చెప్పాడు.



Previous
Next Post »