0

మన్మథుడికి బిస్కెట్‌ వేసిన బ్యూటీ..

Nagarjuna is very special to me
సినిమా ఇండస్ట్రీలో ఎదుట వాళ్లను బుట్టలో వేసుకోవాలంటే.. ఫస్ట్‌ జపించేది పొగడ్తల మంత్రమే. ఇది తెల్సుకున్న బ్యూటీలకు ఇండస్ట్రీలో ఎదురే ఉండదు. అవును.. గ్లామర్‌ ఫీల్డ్‌లో మూడు నాలుగేళ్లకే ఫెయిడ్‌ అవుట్‌ అవుతున్నా కొందరు బ్యూటీలకు ఛాన్స్‌లు వస్తున్నాయంటే కారణం ఇదే. ఈ పవర్‌పుల్ మంత్రాన్ని ఒడిసిపట్టిన శ్రియా శరణ్‌ చిలుక పలుకులు పలుకుతోంది. తనకు ఇప్పటికీ ఇష్టమైన హీరో నాగార్జునే అంటోంది.

ఈ బ్యూటీ నటించిన దృశ్యం హిందీ వర్షన్‌ ఇంటర్వ్యూలో ఈ మాటలు అంది. నేషనల్‌ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ.. ఎవరైనా.. బాలీవుడ్‌ హీరోల దృష్టిలో పడటం కోసం, అమీర్‌ఖానో, సల్మానో పేరు చెప్తారు. కానీ, శ్రియా మాత్రం రివర్స్‌లో నాగార్జున పేరు చెప్పి రిపోర్టర్‌ను ఆశ్చర్యపరిచింది. అందేంటని అడిగితే.. ప్లాష్‌ బ్యాక్‌లోకి వెళ్లిందట.

తెలుగు సినీ ఫీల్డ్‌లో వచ్చిన కొత్తల్లో సంతోషం మూవీలో అవకాశం ఇచ్చి ఎంకరేజ్‌ చేశారు. ఆతర్వాత కూడా చాలా సినిమాల్లో ఆఫర్స్‌ నాగార్జున సార్‌ ఇప్పించారని పొగడ్తల వర్షం కురిపించింది. ఛాన్స్‌లు రావని, శ్రియా పనైపోయిందని అందరు అనుకుంటున్నప్పుడు మనంలో ఛాన్స్‌ ఇచ్చారు. మనంలో కేరక్టర్‌కు నేనే సూట్‌ అవుతానని డైరెక్టర్‌ విక్రమ్‌ కుమార్‌తో అన్నారట. ఇలా.. వరుసగా రిపోర్టర్‌ షాక్‌ అయ్యేలా ఆన్సర్స్ ఇచ్చింది శ్రియా. 

ఏదో ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ అవుతుందనుకుంటే.. బిస్కెట్స్‌తో చంపేసిందని ఆ రిపోర్టర్‌ సన్నిహితులు అన్నాడు. మొత్తానికి శ్రియా పొగడ్తలు నాగార్జున వినే ఉంటారు. మరి, నెక్ట్ మూవీలో శ్రియాకు ఛాన్స్‌ దక్కినట్టే అని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. బెస్ట్‌ ఆఫ్‌ లక్‌ శ్రియా. ఇలాగే.. నలుగురినీ పొగుడుతూ నాలుగు ఛాన్స్‌లు కొట్టేయ్‌. ఎవరి టాలెంట్‌ వారిది. ఇండస్ట్రీలో ఈ మాత్రం తెలివితేటలు లేనివాళ్లు ఉన్నారని సెటైర్లు వేస్తున్నారు. 
Previous
Next Post »