బెంగుళూరులోని రోడ్లపై ప్రమాదకరమైన జీవులు దర్శనమిస్తున్నాయి. మొన్న మొసలి రోడ్డుపై దర్శనమిస్తే, నేసు ఏకంగా అనకొండ దర్శనమిచ్చింది. కానీ, ఇవి అక్కడి ప్రజలను భయపెట్టడం లేదు. అయితే, అధికారులను మాత్రం ఆలోచనలో పడేస్తున్నాయి. కొంచెం కొత్తగా ఉన్నా, అధికారుల మత్తు వదల్చడానికే ఈ జీవులు రోడ్లపై దర్శనమిస్తున్నాయి.
వివరాలలోకి వెళితే, బెంగుళూరులోని కొన్ని చోట్ల స్థానికులకు నిత్యం డ్రైనేజీలు పెద్ద సమస్యగా మారాయి. వీటి గురించి ఎంత చెప్పినా అక్కడి స్థానిక సంస్థల అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో అధికారుల దృష్టిని డ్రైనేజీలపై కేంద్రీకరింప చేసేందుకు అక్కడ కొందరు కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. కొన్ని రోజుల క్రితం అక్కడ రోడ్డు పక్కన డ్రైనేజీ గుంటలో ఓ పెయింటర్ అచ్చం నిజంలా అనిపించే మొసలి బొమ్మను ఏర్పాటు చేసి వార్తల్లోకి ఎక్కాడు. అలాగే ఆ చిత్రాలు అప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. తాజాగా ఇప్పుడు నమ్మా బెంగుళూరు ఫౌండేషన్ అనే ఎన్జీవో రోడ్డు పక్కన గుంటలో ఓ అనకొండ బొమ్మ ఏర్పాటు చేయించింది. ఇది ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ గా మారింది. మరి ఇప్పటికైనా అక్కడి అధికారులు కళ్ళు తెరిచి తమ విధులను సరిగ్గా నిర్వహిస్తారో లేదో చూడాలి.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon