ఇటీవల టీవీ షోలలో కనిపించే యాంకర్లు సినీ స్టార్స్‌ను మించిపోతున్నారు. ప్రముఖ టీవీ షో ‘జబర్దస్త్’తో పాపులర్ అయిన యాంకర్ అనసూయ. సినీమాల వేటలో ఉన్న ఆమె కొన్ని కారణాల వలన జబర్దస్త్ ప్రోగ్రామ్ చేయడం లేదు. అయితే బుల్లి తెరపై వచ్చే పలు కార్యక్రమాలను హోస్ట్ చేస్తూ మంచి పేరు దక్కించుకుంటుంది. గత కొంత కాలంగా వెండితెరపై అడుగుపెట్టాలను ట్రై చేస్తున్న అనసూయకు అనుకున్న విధంగా ఆఫర్లు అందడం లేదు.
సెక్సీ లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే అనసూయకు ఆ మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రంలో ఒక ఐటెమ్ సాంగ్‌లో డ్యాన్స్ చేసే అవకాశం వచ్చింది. అయితే అందుకు అనసూయ నిరాకరించింది. ఇక ఇప్పుడు తాజాగా నాగార్జున నటిస్తున్న సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్‌కు నాగ్‌తో కలిసి చిందులేసే ఛాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు కూడా అనసూయ అంగీకరించలేదు. పెద్ద హీరోల చిత్రాలలో వచ్చే అవకాశాలను అనసూయ నో చెప్పడంపై చిత్ర పరిశ్రమలో ఆమెపై పలు విధాలైన కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి అమ్మడు ఎటువంటి ఆఫర్లు కావాలో అని పలువురు చెవిలు కొరుక్కుంటున్నారు.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon