0

భారత్‌లో పోర్న్ సైట్లు చూస్తున్న మహిళలు అధికమే... అధ్యయనం

పోర్న్ సైట్లు. ఈ సైట్లు గురించి ఇంకా విడమర్చి చెప్పక్కర్లేదు. నగ్నంగా నటీనటులు ఇందులో నటించడమే కాకుండా కామక్రీడలు కూడా ఆచరిస్తుంటారు. ఇలాంటి సైట్లను సర్వీస్ ప్రొవైడర్లు బ్లాక్ చేశారు. ఐతే ఈ పోర్న్ సైట్లను భారతదేశంలో ఎక్కువమంది స్త్రీలు వీక్షిస్తున్నట్లు న్యూయార్క్‌కు చెందిన ఓ వెబ్ సైట్ చేసిన అధ్యయనంలో తేలింది. భారతదేశంలో పోర్న్ సైట్లను చూసే మహిళలు 30 శాతం ఉండగా గత ఏడాది అది 26 శాతం ఉన్నట్లు తెలిపింది.

ముఖ్యంగా లెస్బియన్ పోర్న్ సైట్లను చూసే మహిళల సంఖ్య ఎక్కువగా ఉందట. పురుషులు, స్త్రీలు కలిసి ఉండే పోర్న్ సైట్ల కంటే స్త్రీలు-స్త్రీలు కలిసి ఉండే సైట్లను ఎక్కువగా చూస్తున్నట్లు తేలిందట. మొత్తమ్మీద చూస్తే ప్రపంచ వ్యాప్తంగా పోర్న్ సైట్లను చూస్తున్న మహిళల సంఖ్య సుమారుగా 4 కోట్లు ఉన్నట్లు ఆ అధ్యయనంలో వెల్లడైంది. పోర్న్ సైట్లను అత్యధికంగా చూస్తున్న మహిళలు ఫిలిప్పిన్స్, బ్రెజిల్ దేశాల్లో ఎక్కువట. ఆ తర్వాత స్థానాల్లో భారతదేశం, అర్జెంటీనా ఉన్నాయని తేలింది.

ఈ పోర్న్ సైట్ల పైన వారు వెచ్చించే సమయం కూడా సరాసరిన చూస్తే 10 నిమిషాల 10 సెకన్లుగా ఉన్నట్లు వెల్లడైంది. మగవారి విషయానికి వస్తే ఈ సరాసరి 9 నిమిషాల 22 సెకన్లుగా ఉంది. జపాన్ దేశంలో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. అక్కడ 83 శాతం పురుషులు పోర్న్ సైట్లు చూస్తుండగా కేవలం 17 శాతం స్త్రీలు మాత్రమే పోర్న్ సైట్లు చూస్తున్నారట.
Previous
Next Post »