0

భర్తని రోడ్డుపై పరుగెత్తించి కొట్టింది

पत्नी ने बेटी और महिलाओं के साथ मिलकर की पति की पिटाई।
లక్నో: తనను అసభ్యకరంగా వీడియో తీసి దారుణంగా ప్రవర్తిస్తున్నాడని ఓ భార్య తన భర్తను చితకబాదింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నోర్‌లో జరిగింది. స్థానిక జిల్లా మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లుడు ఆకాశ్ వర్మ ఓ రెస్టారెంటులో భోజనం చేస్తున్నాడు. 
ఇంతలో ఉన్నట్టు ఉండి ఆకాశ్ భార్య, ఆమె తల్లి, సోదరుడు అక్కడకు వచ్చారు. ఆకాశ్ చొక్క పట్టుకొని అందరిముందు చితకబాదారు. అంతేకాదు, రోడ్డు పైన పరుగెత్తించి కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. 
బాధితురాలు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొన్ని రోజులుగా భర్త ఆమెను కట్నం కోసం వేధిస్తున్నాడు. కట్నం ఇవ్వనందుకు అసభ్యకర వీడియోలు చిత్రీకరించాడని ఫిర్యాదులో పేర్కొంది.
Previous
Next Post »