బెర్లిన్: అదృష్టం వెంటే ఉంటే ఆవగింజంత తేడాతో అపాయం తప్పుతుందన్నది నానుడి. దీన్ని నిజం చేసే సంఘటన జర్మనీలోని ఓ పట్టణంలో చోటు చేసుకుంది. నార్త్ రైన్ వెస్ట్‌ఫాలియాంవాసులైన దంపతులు బైక్‌పై ప్రయాణిస్తూ, అడవి పందుల వేట సాగుతున్న ప్రాంతంలో ప్రవేశించారు. వెనుక కూర్చున్న భార్యకు హఠాత్తుగా ఛాతీలో నొప్పిగా అనిపించి బైక్ ఆపాల్సిందిగా భర్తకు సూచించింది. తర్వాత పరికించి చూస్తే కొంతదూరంలో ఓ బుల్లెట్ కనిపించింది. ఇంతకూ జరిగిందేమిటంటే... ఒక వేటగాడు పేల్చిన బుల్లెట్ పందిని రాసుకుంటూ ఆ మహిళపైకి దూసుకొచ్చింది. అదృష్టవశాత్తూ అది ఆమె ధరించిన ‘బ్రా’ కింది భాగంలోని తీగకు తగిలి పక్కకు మళ్లడంతో వెంట్రుకవాసిలో ప్రాణాపాయం తప్పింది.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon