వీళ్లు ప్రజాప్రతినిధులు... ప్రజలకి ఆదర్శంగా ఉండాల్సిన వారు... ప్రజల తరుపున పోరాడేందుకు వీళ్ళకి పదవి ఇచ్చి పార్లమెంట్ కి పంపుతాం... మరి మన ఎం.పీ లు దేని కోసం పోరాడుతున్నారో తెలుసా..? సిగిరెట్ తాగేందుకు పార్లమెంటు భవనంలో ఉన్న పొగతాగే గదిని మళ్లీ కేటాయించమని..
అసలు ఎం జరిగిందంటే... ఆరోగ్యానికి విపరీతంగా హాని చేసే సిగిరెట్ కాల్చటాన్ని అడ్డుకోవాలని భావించిన లోక్ సభ స్పీకర్... సిగిరెట్ తాగేందుకు గతంలో కేటాయించిన హాలును... స్టెనో గ్రాఫర్లకు కేటాయించి.. ఎంపీలు ధూమపానానికి దూరంగా వుంచాలనుకున్నారు...
కాని... ఆరోగ్యం కంటే కూడా సిగిరెట్ కాల్చటం మీద మోజున్న ఈ పొగరాయుళ్లు... పార్టీలకు అతీతంగా స్పీకర్ వద్దకు వెళ్లి... సిగిరెట్ తాగేందుకు గతంలో కేటాయించిన హాలును మళ్లీ పొగతాగేందుకు ఏర్పాటు చేయాలని కోరారు... ఎంపీల డిమాండ్ కు స్పీకర్ వెనక్కి తగ్గక తప్పలేదు... పార్లమెంటు భవనంలో ఉన్న పొగతాగే గదిని మళ్లీ అందుకే వినియోగించాలని నిర్ణయించారు... మొత్తానికి అధికార.. విపక్షాలు రెండు కలిసి పోరాడి విజయం సాధించిన ఏకైక అంశం ఇదేనేమో బహుశా..!!
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon