0

రాసలీలల స్వామీ తాట తీశారు

కర్ణాటక నుంచి ఆ స్వామీజీ రంగారెడ్డి జిల్లాకు చేరుకున్నాడు. అన్ని సమస్యలకూ పరిష్కారం చెబుతానంటూ గ్రామస్తుల నమ్మకాన్ని చూరగొన్నాడు. ముఖ్యంగా మహిళలకు మాయమాటలు చెప్పి తాను నిజమైన స్వామీజీనని భ్రమించేలా చేశాడు. కొందరు మహిళలను లోబరచుకునే ప్రయత్నం చేశాడు. కాగా తన భర్త మూడేళ్ళ క్రితం ఇల్లు వదిలి వెళ్ళాడని, అతడు తిరిగి ఇంటికి వచ్చేలా చూడాలని ఇటీవల ఓ మహిళ ఈ ఫేక్ బాబాను ఆశ్రయించింది.

రాత్రికి వస్తే నీ సమస్యకు పరిష్కారం చెబుతానని ఆ నకిలీ బాబా చెప్పడంతో ఆమెకు అనుమానం కలిగింది. అయితే అతని అసలు నైజం తెలుసుకునేందుకు రాత్రివేళ వెళ్ళగా ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలు తప్పించుకుని ఈ విషయాన్ని తన బంధువులకు, స్థానికులకు తెలియజేయడంతో ఆగ్రహించిన వారంతా ఆ రాసలీలల బాబాకు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. రంగారెడ్డి జిల్లా బంట్వారం మండలం తొరమామిడి గ్రామంలో జరిగింది ఈ ఘటన..ఇలాంటి దొంగ స్వామీజీల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Previous
Next Post »