ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి పార్ట్ 2పై సినీ ప్రేక్షకులంతా వేయి కనులతో వేచి చూస్తున్నారు. బాహుబలి బిగినింగ్ అంతర్జాతీయ వ్యాప్తంగా భారీ కలెక్షన్స్ సాధించిన నేపథ్యంలో.. పార్ట్ 2పై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. బాహుబలి 2లో అనుష్క పరాక్రమాలపై కథ నడుస్తుందని, ప్రభాస్ అమరేంద్ర బాహుబలిగా కనిపిస్తాడని టాక్ వస్తోంది. అయితే దేవసేన రోల్‌లో కనిపించే అనుష్క, రానాల మధ్య రేప్ సీన్ ఉంటుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
ఈ సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే ముగిసిందని తద్వారా బాహుబలి పార్ట్ 2 ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతున్నట్లు తెలిసింది. ఈ సినిమాలో పరాక్రమ వనితగా అనుష్క కనిపించనుంది. కుంతల రాజ్యానికి రాణిగా దేవసేనగా బాహుబలిలో కనిపిస్తోంది. ఇప్పటికే అనుష్క, ప్రభాస్‌ల మధ్య గల సన్నివేశాల చిత్రీకరణ పూర్తయ్యింది. అనుష్క, రానాలపై కొన్ని వార్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon