చిత్రం :శ్రీమంతుడు
బ్యానర్ :మైత్రీ మూవీ మేకర్స్
దర్శకుడు :కొరటాల శివ
నిర్మాత :నవీన్ యార్నేని, వై.రవిశంకర్, మోహన్
సంగీతం :దేవిశ్రీప్రసాద్
సినిమా రేటింగ్ : 3.5
ఛాయాగ్రహణం :మది
ఎడిటర్ :కోటగిరి వెంకటేశ్వరరావు
నటినటులు :మహేష్ బాబు, శృతిహాసన్, జగపతి బాబు, సుకన్య, రాజేంద్రప్రసాద్, రాహుల్ రవీంద్రన్, పూర్ణ తదితరులు
మిలీనియర్ రవికాంత్ (జగపతి బాబు) కొడుకు హర్ష(మహేష్ బాబు). హర్ష తన జీవితంలో తనకు నచ్చినట్లుగా వుండాలని అనుకుంటాడు కానీ బిజినెస్ చూసుకోమంటూ హర్షను ఒత్తిడి చేస్తాడు రవికాంత్. ఇలా జరుగుతున్న సమయంలోనే హర్ష అనుకోకుండా చారుశీల(శృతిహాసన్)ను కలుస్తాడు. అలాగే రూరల్ డెవలప్ మెంట్ కార్యక్రమాల గురించి తెలుసుకుంటాడు. కొద్దిరోజులకే చారుశీలతో ప్రేమలో పడతాడు హర్ష. రూరల్ డెవలప్ మెంట్ గురించి చారుశీల ఆలోచనలు, విధానాలు నచ్చి... చారుశీల గ్రామం మరియు వాళ్ల కుటుంబ సభ్యుల గురించి తెలుసుకోవడానికి చారుశీల గ్రామం దేవరకొండకు వెళతాడు. అక్కడి పరిస్థితి చూసిన హర్ష... ఆ ఊరిని దత్తత తీసుకొని, అభివృద్ధి చేయాలని అనుకుంటాడు. కానీ హర్ష పనికి కొంతమంది రౌడీలు అడ్డుపడతారు. ఆ తర్వాత ఏం జరిగింది? హర్ష ఆ సమస్యలను ఎలా అధిగమించాడు? ఆ రౌడీల నుంచి ఆ ఊరిని ఎలా కాపాడుతాడు? ఆ ఊరిని ఎలా అభివృద్ధి చేస్తాడు? అనే అంశాలను వెండితెర మీద చూస్తేనే చాలా బాగుంటుంది.
గతకొద్ది కాలంగా వరుస ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ చిత్రంపైనే ఆశలు పెట్టుకున్నాడు. ‘ఆగడు’, ‘1 నేనొక్కడినే’ చిత్రాల తర్వాత మహేష్ నటించిన తాజా చిత్రం ‘శ్రీమంతుడు’. ఇప్పటివరకు ఎన్నో కమర్షియల్ యాక్షన్ చిత్రాల్లో నటించిన మహేష్ తొలిసారిగా ‘శ్రీమంతుడు’తో ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రంలో నటించాడు.
పలు హిట్ చిత్రాలకు మాటల రచయితగా పనిచేసిన కొరటాల శివ దర్శకుడిగా మారి తెరకెక్కించిన తొలి చిత్రం ‘మిర్చి’. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ‘మిర్చి’ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీమంతుడు’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీమంతుడు’కు భారీ క్రేజ్ ఏర్పడింది.
తొలిసారిగా ఈ చిత్రం ద్వారా మహేష్ సరసన శృతిహాసన్ నటించింది. వీరిద్దరూ కలిసి ‘ఆగడు’ సినిమాలోని ‘జంక్షన్లో..’ అనే మాస్ ఐటెం సాంగ్ లో జతకట్టినప్పటికీ... ‘శ్రీమంతుడు’ చిత్రంలో వీరిద్దరూ హీరోహీరోయిన్లుగా నటించారు. వీరిద్దరి జంట బాగుందంటూ ఇప్పటికే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నారు.
ఇక రాకింగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. కొరటాల శివ-దేవి(మిర్చి) మరియు మహేష్-దేవి(1 నేనొక్కడినే)ల కలయికలో ‘శ్రీమంతుడు’ రెండవ చిత్రం. ‘శ్రీమంతుడు’ చిత్రంలోని అన్ని పాటలు కూడా ప్రస్తుతం టాప్ 1 స్థానంలో దుమ్మురేపుతున్నాయి.
ఈ చిత్రంలో జగపతిబాబు, సుకన్య, రాజేంద్రప్రసాద్, రాహుల్ రవీంద్రన్, పూర్ణ వంటి పలువురు తారలు ప్రధాన పాత్రలలో నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మాతలు నవీన్ యార్నేని, వై.రవిశంకర్, మోహన్ సంయుక్తంగా నిర్మించారు.
ఈ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ టాక్ తో ప్రచారం జరుగుతోంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం మంచి విజయం సాధించనుందంటూ టాలీవుడ్ లో పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. తెలుగు, తమిళం భాషలలో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం భాషలలో నేడు (ఆగష్టు 7) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!
ప్లస్ పాయింట్స్:
‘శ్రీమంతుడు’ చిత్రానికి మేజర్ ప్లస్ పాయింట్స్ రెండు. ఒకటి కథ, రెండవది మహేష్ నటన. కథ గురించి సాంకేతికవర్గం విభాగంలో చర్చించుకుందాం. ఇక మహేష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇప్పటివరకు మహేష్ నటించిన సినిమాలన్నీ కూడా ఒకవైపు తీసుకుంటే ‘శ్రీమంతుడు’ మరోవైపుగా తీసుకోవచ్చు. ఎందుకంటే యాక్టింగ్ పరంగా మహేష్ చాలా ఇంప్రూవ్ అయ్యాడు. ‘శ్రీమంతుడు’ చిత్రం మొత్తాన్ని కూడా మహేష్ తన భుజాలపై నడిపించాడు.
హర్ష పాత్రలో మహేష్ ఒదిగిపోయాడు. ఓ మిలినీయర్ కొడుకుగా హవాభావాలు పలికిస్తూనే మరోవైపు సింపుల్ కామన్ మ్యాన్ కోరుకునే అంశాలను తన నటనతో చాలా చక్కగా చూపించాడు. ముఖ్యంగా కొన్ని కొన్ని సన్నీవేశాలలో మహేష్ యాక్టింగ్ సూపర్బ్. ఈ సినిమాలో మహేష్ తప్ప ఇంకెవరూ సరిపోరు అనే విధంగా చాలా చక్కగా నటించాడు. ఇక డాన్సులు, ఫైట్లలో మహేష్ ఇరగదీసాడు. ఇందులో మహేష్ చెప్పిన డైలాగ్స్ కు థియేటర్లలో భారీ రెస్పాన్స్ వస్తుంది.
ఇక చారుశీల పాత్రలో శృతిహాసన్ చాలా చక్కగా నటించింది. సింపుల్ అండ్ బ్యూటిఫుల్ అని అనిపించే విధంగా శృతిహాసన్ తన యాక్టింగ్, గ్లామర్, డాన్సులతో సింప్లీ సూపర్బ్. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో కొన్ని కొన్ని చోట్ల శృతిహాసన్ యాక్టింగ్ చాలా బాగుంది. మహేష్, శృతిహాసన్ ల జోడీ బాగుంది. వీరిద్దరి కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయ్యింది. ట్రెడిషనల్ డ్రెస్సులోనే కనిపిస్తూనే, చాలా స్టైలిష్ గా తన గ్లామర్ తో పిచ్చెక్కించేసింది.
తొలిసారిగా మహేష్ కు తండ్రి పాత్రలో నటించిన నటుడు జగపతిబాబు తన పాత్రకు వంద శాతం న్యాయం చేసాడు. ఓ మిలినీయర్ కు వుండాల్సిన హవాభావాలను జగపతి బాబు చాలా చక్కగా చూపించాడు. ముఖ్యంగా మహేష్, జగపతి బాబుల మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. అలాగే రాజేంద్ర ప్రసాద్, సుకన్య, రాహుల్ రవీంద్రన్ వారి వారి పాత్రలలో ఒదిగిపోయారు. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రలకు తగిన న్యాయం చేసారు.
‘శ్రీమంతుడు’ చిత్రం ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా లవ్, ఎంటర్ టైన్మెంట్ తో వుండటం... సెకండ్ హాఫ్ ఫ్యామిలీ, యాక్షన్, ఎమోషనల్ ఎంటర్ టైన్ తో బాగుంది. మొత్తానికి ఫస్ట్ హాఫ్ సూపర్.. సెకండ్ హాఫ్ ఇంకా సూపర్.!
మైనస్ పాయింట్స్:
ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ అంటే పెద్దగా ఏమి లేదు కానీ... సింపుల్ క్లైమాక్స్ మరియు చిత్ర రన్ టైం కాస్త ఎక్కువైనట్లుగా అనిపిస్తుంది. అయినా మహేష్ ఇలా ‘శ్రీమంతుడు’గా అభిమానులు ఎంత సమయమైనా అలాగే చూస్తూ వుండిపోతారు. ఆ రన్ టైం కూడా పెద్దగా మైనస్ పాయింట్ గా అనిపించదు.
సాంకేతికవర్గం పనితీరు:
‘శ్రీమంతుడు’ చిత్రంలోని సాంకేతికవర్గంలో మేజర్ ప్లస్ పాయింట్స్ మూడు విభాగాలున్నాయి. కథ, సినిమాటోగ్రఫి, సంగీతం. ఈ సినిమాకు ప్రముఖ రచయిత కొరటాల శివ దర్శకుడు కావడంతో భారీ ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాను రాసుకున్న కథను స్ర్కీన్ పైన అద్భుతంగా చూపించాడు. మహేష్ ఎలా చూపించాలని అనుకున్నాడో అదే విధంగా ప్రజెంట్ చేసాడు. సింపుల్ స్టోరీ లైన్ తీసుకొని, కథనం విషయంలో చాలా చక్కగా తీర్చిదిద్దాడు. ముఖ్యంగా కొన్ని కొన్ని సీన్లు సూపర్బ్. డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఇందులో మహేష్ ను చాలా స్టైలిష్ గా చూపించాడు.
ఇక శ్రీమంతుడు సినిమా విడుదలకు ముందే భారీ క్రేజ్ రావడానికి గల కారణంలో కీలక విభాగం సంగీతం. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. సినిమా విడుదలకు ముందే పాటలు బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. ఇక థియేటర్లో ఆ పాటలను చూస్తుంటే మరింత జోష్ వస్తుంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇరగదీసాడు. ‘శ్రీమంతుడు’ చిత్రానికి దేవి ఇచ్చిన రీరికార్డింగ్ ప్రాణంగా నిలిచిందని చెప్పుకోవచ్చు.
ఇక దర్శకుడు తను ఎంత అద్భుతంగా కథను రాసుకున్నా కూడా.. తన ఆలోచనలకు తగ్గట్లుగా లైటింగ్, కెమెరా పనితనం చూపించే సినిమాటోగ్రాఫర్ కావాలి. ఈ సినిమాకు మది సినిమాటోగ్రఫి అదుర్స్. ఒక్కొక్క ఫ్రేం చాలా బాగుంది. మహేష్ ఇందులో చాలా స్టైలిష్ గా, మరింత అందంగా చూపించాడు. కొన్ని కొన్ని సీన్లలో విజువల్స్ చాలా బాగున్నాయి. ఇక ఎడిటింగ్ బాగుంది. మొదటిసారిగా నిర్మాణరంగంలోకి అడుగుపెట్టిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఎక్కడా రాజీపడకుండా చాలా చక్కగా నిర్మించారు. సినిమా చాలా గ్రాండ్ గా, భారీగా తెరకెక్కించారు.
చివరగా:
శ్రీమంతుడు: కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon