శవంగా నటించిన ఓ వ్యక్తి.. సరిగ్గా ఐదు రోజులకు నిజంగానే శవమయ్యాడు. దీంతో ఆ ప్రాంతవాసులు ఆందోళనకు గురయ్యారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా ఆత్తూరు రాణిపేట వద్ద చోటు చేసుకుంది. తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే..
ఈనెల 10వ తేదీన డీఎంకే ఆధ్వర్యంలో మద్యనిషేధం కోరుతూ ఆందోళన నిర్వహించారు. ఇందులో డీఎంకే కార్యకర్తగా ఉన్న ఇదే ప్రాంతానికి చెందిన సేఠ్ అలియాస్ సెల్వరాజ్ శవంగా నటించాడు. ఓ వ్యక్తి మద్యపానానికి అలవాటు పడితే ఎలా ప్రాణాలు కోల్పోతాడో ధర్నాలో పాల్గొన్న ప్రతి కార్యకర్తకు కళ్ళకట్టినట్టు నటించి చూపాడు.
ఆ మరుసటి రోజు నుంచి సేఠ్ తీవ్రమైన జ్వరంతో బాధపడ్డాడు. దీంతో అతనిని సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి కన్నుమూశాడు. ఐదు రోజుల క్రితం శవంగా నటించి నవ్వించిన సేఠ్... నిజంగానే శవంగా మారి స్థానికులందరితోనూ కన్నీళ్ళు పెట్టించాడు. దీనిపై డీఎంకే నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon