హోటల్స్ కు, రెస్టారెంట్ కు ఒంటరిగా వెళ్ళే యువకులతో.. ఓ మహిళా పరిచయం పెంచుకుంటుంది.. వారితో సరదాగా మాట్లాడుతుంది. వారు ఎక్కడినుంచి వచ్చారో.. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో.. ఏం చేస్తున్నారో తెలుసుకుంటుంది. ఆమెతో కాసేపు మాట్లాడితే చాలు.. ఎవరైనా ఫ్లాట్ అయిపోతారు.
ఆ తరువాత వారిని అభ్యంతరం లేకపోతే తనతో రమ్మని చెప్తుంది. అంతసేపు ఆమెతో తరువాత తప్పకుండా రాను అని చెప్పలేరు.. చెప్పాలని అనిపించదు కుడా. ఇక వారిని తన కారులో ఎక్కించుకొని తీసుకెళ్తుంది. అయితే, కారులో ఆమెతో వెళ్తున్న యువకులకి మొదట కాస్త భయం కలగడం సహజమే.
ఇక, అక్కడి నుంచి ఆ మహిళ వారిని ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా.. ఓ ఒల్డేజ్ హొమ్ కు తీసుకెళ్తుంది. ఒంటరి తనం అన్నది నరకంతో సమానమని.. అదీ ముఖ్యంగా ముసలి వయసులో ఒంటరిగా ఉండటమంటే.. వల్లకాని పని అని చెప్పి.. ఖాళీగా ఉన్న సమయంలో అక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడాలని, వాళ్ళకి సహాయపడాలని చెప్తుంది.
సాధారణంగా మహిళా ఒంటరిగా ఉన్న యువకులతో మాట్లాడినపుడు.. వేరే వేరే అర్ధం చేసుకుంటారు. కాని, విషయం మాత్రం అదికాదని తెలిశాక సిగ్గుతో తలొంచుకొని తప్పకుండా సహాయపడతారని ఆమె ఉద్దేశ్యం. సామాజిక అంశంతో కూడిన ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో హల్ చల్ చేస్తున్నది.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon