బాహుబలి’ బ్లాక్ బస్టర్ హిట్ తో బాలీవుడ్ సెలెబ్రెటీగా మారిపోయిన రాజమౌళిని బాలీవుడ్ కబ్జా చేయాలని చాల భారీ ప్రయత్నాలే చేస్తోంది. ‘బాహుబలి సినిమాను హిందీలో రిలీజ్ చేసిన కరణ్ జోహార్ రాజమౌళిని ఎదో విధంగా ఒక భారీ హిందీ సినిమాకు దర్శకత్వం వహించే విధంగా ఒప్పించడానికి చాల భారీ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కరణ్ జోహార్ చేస్తున్న ప్రయత్నాల వెనుక యూటివి అధినేత సిద్ధార్ద్ రాయ్, ఈరోస్ సంస్థ అధినేత సునీల్ లుల్లా ప్రముఖ బాలీవుడ్ నిర్మాతలు సాజిథ్ నాడి వాలా, మధు మంటేనా లాంటి ప్రముఖ వ్యక్తుల ప్రోద్భలం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. గతంలో ‘రౌడీ రాధౌడ్’ సినిమాను రాజమౌళి చేత దర్శకత్వం వహించాలని చాలామంది ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు విజయవంతం కాలేదు.
దీనితో ఈసారి ఏదోవిధంగా రాజమౌళిని ఒక బాలీవుడ్ సినిమా చేసే విషయమై ఒప్పించి తీరాలని బాలీవుడ్ బడా ప్రముఖులు చాల గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై రాజమౌళి అంగీకారం కోసం 20 నుంచి 25 కోట్ల వరకు భారీ పారితోషికాలను రాజమౌళికి ఆఫర్ చేస్తున్నట్లు మీడియా వార్తలు వ్రాస్తోంది.
అయితే ఈ కోట్లాది రూపాయలు రాజమౌళి పై ఎటువంటి ప్రభావాన్ని చూపెట్టకుండా ‘బాహుబలి 2’ విడుదల తరువాత ఈ విషయాల పై ఆలోచిద్దాం అంటూ రాజమౌళి చాల సున్నితంగా బాలీవుడ్ ప్రముఖులకు సమాధానాలు ఇస్తున్నట్లు టాక్. ఇంటిలోకి నడిచి వస్తున్న కోట్ల రూపాయలను కూడ లెక్కచేయని ఎత్తుకు ఎదిగిపోయాడు రాజమౌళి..
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon