0

మల్లికా షెరావత్ కు రాజమౌళి అవకాశం ఇస్తాడా..?

mallika-sharwat-rajmouli
ధర్టీ పాలిటిక్స్ చిత్రంతో అందర్నీ ఆకట్టుకున్న మల్లికా షెరావత్ తన మనసులోని కోరికను బయటపెట్టింది. తాజాగా అందరు పౌరాణిక చిత్రాలలోనూ, సామాజిక భాద్యతతో కూడిన షార్ట్ ఫిల్మ్ లోనూ నటిస్తూ బాలివుడ్ తారలు బిజీ గా ఉన్న సంగతి విదితమే. ఖాళీగా ఉన్న సమయాలలో షార్ట్ ఫిల్మ్ లో నటిస్తూ తమ టాలెంట్ ను నిరుపించుకుంటున్నారు. ఇక ఇటీవలే బాలివుడ్ బ్యూటీ రాధికా ఆప్టే నటించిన అహల్యా అనే షార్ట్ ఫిల్మ్ ఎంతటి క్రేజ్ సంపాదించిందో అందరికీ తెలిసిందే. ఈ షార్ట్ ఫిల్మ్ కు యూట్యూబ్ లో 45 లక్షలకు పైగా హిట్స్ వచ్చాయి.

ఇక, ఇదిలా ఉంటే, మల్లికా షెరావత్ కు ద్రౌపది క్యారెక్టర్ లో నటించాలని ఉందని అవకాశం తప్పకుండా నటిస్తానని చెప్తున్నది. ఇక మహాభారతాన్ని ఎప్పటికైనా తెరకెక్కించాలని టాలివుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. బాహుబలి విజయం తరువాత ఆయనకు పురాణగాధలను నిర్మించగలననే ధైర్యం వచ్చింది. తనకు మహాభారతం అంటే ఎంతో ఇష్టమని దానిని తన స్టైల్ లో ఎప్పటికైనా తెరకెక్కించాలని పలుమార్లు రాజమౌళి ఇంటర్వ్యూ లో పేర్కొన్నారు. మరి మల్లికా షెరావత్ కోరిక నెరవేరాలంటే.. రాజమౌళి మహాభారతాన్ని తెరకేక్కించాలి. ఒకవేళ రాజమౌళి మహాభారతాన్ని తెరకెక్కిస్తే.. మల్లికా షెరావత్ కు ఆవకాశం ఇస్తారా అన్నది ఆలోచించాల్సిన అంశమే.
Previous
Next Post »