0

మూడో తరగతి పాఠ్యపుస్తకంలో... సెక్స్ బాబా ఫోటో..

asaram babu
రాజస్థాన్‌లో మూడో తరగతి పాఠ్యపుస్తకంలో ఆధ్యాత్మిక గురువుల వరుసలో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో అరెస్టై జైలు జీవితం గడుపుతున్న నిందితుడు ఆసారం బాపు ఫోటో చోటుచేసుకుంది. బీజేపీ పాలనలో ఉన్న రాజస్థాన్ రాష్ట్రంలోని మూడో తరగతి పాఠ్యాంశంలో మదర్‌థెరెసా, వివేకానంద, రామకృష్ణ పరమహంస, శంకరాచార్య, గౌతమ బుద్ధలతో కబీర్‌దాస్, మీరా వంటి ప్రముఖుల చిత్రాల వరుసలో ఆసారం బాపు చిత్రాన్ని ఆ పుస్తకంలో పొందుపరిచారు.

ఆ వరుసలోయోగా గురువు రాందేవ్‌బాబా చిత్రం కూడా ఇందులో ఉంది. అయితే 16 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొన్న ఆసారం బాపు జోధ్‌పూర్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్నారు. ఇలాంటి వ్యక్తి ఫొటోను పాఠ్యపుస్తకంలో ముద్రించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీకి చెందిన గురుకుల్ ఎడ్యుకేషన్స్ పబ్లిషర్స్ ఈ పుస్తకాలను ముద్రించింది.

అయితే పుస్తకాలు ముద్రించేనాటికి ఆసారాంపై ఎలాంటి కేసులు లేవని, ప్రస్తుతం ఆ పుస్తకాలను వెనక్కి తీసుకుంటున్నట్టు పబ్లిషర్స్ ప్రకటించారు. ఎప్పుడో రద్దు చేయాల్సిన పుస్తకాలను ఇంకా కొనసాగించడమేమిటని విద్యాశాఖ అధికారులపై ఆరోపణలు వెల్లువెత్తాయి. వెంటనే వాటిని తిప్పి పంపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Previous
Next Post »