0

ITEMVIDEOS: ఆ గుడిలో మందు బాటిలే ప్రసాదం


గుడికి పోయే వాళ్ళు ఎక్కడైనా పూలు, పండ్లు, కొబ్బరి కాయలు పట్టుకెళ్తారనే మనకు తెలుసు. కానీ ఈ గుడి అన్ని గుడుల లాంటిది కాదు.. ఇక్కడికొచ్చే భక్తులు తప్పకుండా మందుసీసా పట్టుక రావాల్సిందే . ఇక్కడ ప్రతి రోజూ మందు సీసాల గలగలలు వినపడాల్సిందే. ఈ గుడి ఢిల్లీలో పురానా ఖిలా, ప్రగతీ మైదాన్ ల దగ్గర్లో ఉంది. ఈ గుడిని పాండవుల కాలంలో నిర్మించారని చెబుతారు. ఈ గుడిలో కొలువుతీరిని భైరవ స్వామికి అన్నింటికన్నా మందే ప్రీతి పాత్రమైనది. ఇక ఆదివారమైతే మందు వరదలై పారాల్సిందే. భైరవుడంటే శివుడు. ఈ దేవునికి మందు ప్రసాదంగా పెడితే తాము కోరిన కోర్కెలన్నీ తీరుతాయని భక్తుల నమ్మకం. ఇక్కడికొచ్చే భక్తులు వారి వారి తాహతుకు తగ్గట్టు ఫారెన్ విస్కీ, రమ్, బ్రాందీ, జిన్ ఇలా చాలా రకాల వెరైటిలు తీసుకొస్తుంటారు. లోకల్ మందు కూడా తీసుక పోవచ్చు.

ఇక శివయ్యకు ప్రసాదంగా కొంత మందు పోసి మిగతా దాంట్లో పూజారులకు, ఇతర భక్తులకు, గుడి బైట డబ్బాలు, సీసాలు, లోటాలతో రడీగా ఉండే బిచ్చగాళ్ళకు పోస్తూ ఉంటారు. ఇంటికి వెళ్ళి మిగతాది తామే తాగాలనుకునే వాళ్ళు ఆ మిగతా సగం జాగ్రత్తగా ఇంటికి పట్టుకెళ్తారు. అలా వెళ్ళే వాళ్ళు బిచ్చగాళ్ళ పద్మవ్యూహంలోంచి వెళ్ళడం కొంచం కష్టమే అయినా కొందరు ఆ పద్మవ్యూహంలోంచి తప్పించుకొని వెళ్ళగల్గుతారు. ఎందుకొచ్చిన గొడవ అనుకున్నవాళ్ళు ఉన్నదంతా వాళ్ళ సీసాల్లో ఒంపేసి వెళ్ళి పోతారు. ఇక ప్రతి రోజూ, ముఖ్యంగా ఆదివారాలు. ఆ గుడి బైట ఓ యుద్ద వాతావరణం నెలకొని ఉంటుంది. తాగి ఊగుతూ, ఊగి తాగుతూ , కొట్టుకుంటూ, తన్నుకుంటూ, రక్తాలు కార్చుకుంటూ, ఆస్పత్రుల్లో భర్తీ అవుతూ.... ఓహ్.. అది ఒక రణ రంగమే. అయితే గుడి లోపల మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. లోపల దేవుడికి ప్రసాదం పెట్టడటమే తప్ప అక్కడెవ్వరూ తాగరు.

Note : ఇక్కడ పూలు, ఇతర పూజా సామాన్లతో పాటు అన్ని రకాల మందు అమ్మబడును


     
Previous
Next Post »